అక్షరటుడే వెబ్‌డెస్క్: Hector Tomahawk SUV | జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా తన సరికొత్త ‘హెక్టర్ టొమాహాక్’ (Hector Tomahawk) ఎస్‌యూవీని హైదరాబాద్ ( Hyderabad )మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ ప్రీమియం కారును ఎలక్ట్రిక్ (EV), ప్లగ్-ఇన్ హైబ్రిడ్ (PHEV) పవర్‌ట్రెయిన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంచారు. హైదరాబాద్‌లోని ఎంజీ షోరూమ్‌లో ప్రముఖ నటి అనన్య నాగళ్ల, రామ్ గ్రూప్ సీఈఓ గుంజీత్ సింగ్ సచ్‌దేవా చేతుల మీదుగా ఈ కారును ఆవిష్కరించారు. హెక్టర్ టొమాహాక్ EV (BaaS మోడల్) ప్రారంభ ధర ₹13.99 లక్షలు + కిమీకి రూ. 4.90 బ్యాటరీ రెంటల్ ఉండగా, పూర్తి వాహన సొంత ధర (Ex-showroom) రూ. 19.49 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. అలాగే హెక్టర్ టొమాహాక్ PHEV (BaaS మోడల్) ప్రారంభ ధర ₹21.79 లక్షలు + కిమీకి రూ. 3.20 బ్యాటరీ రెంటల్ కాగా, దీని ఇంట్రడక్టరీ ఎక్స్-షోరూమ్ ధర ₹25.69 లక్షల నుంచి ఉంది. ఈ కార్ల బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. EV డెలివరీలు 2026 సెప్టెంబర్‌లో, PHEV టెస్ట్ డ్రైవ్స్ , డెలివరీలు నవంబర్‌లో ప్రారంభం కానున్నాయి. EV , PHEV రెండింటి మొదటి యజమానికి కంపెనీ లైఫ్‌టైమ్ బ్యాటరీ వారంటీని అందిస్తోంది.
Hector Tomahawk SUV | డిజైన్ , స్పేస్ విశేషాలు..
ఈ ఎస్‌యూవీ అధునాతన అడాప్ట్ (ADAPT) ప్లాట్‌ఫామ్‌పై రూపుదిద్దుకుంది. ఇది 4,745 మిమీ పొడవు, 1,850 మిమీ వెడల్పు, 1,770 మిమీ ఎత్తుతో పాటు 2,810 మిమీ వీల్‌బేస్‌ను కలిగి ఉంది. దీనివల్ల క్యాబిన్ అత్యంత విశాలంగా ఉండి ప్రయాణికులకు చక్కటి సౌకర్యాన్ని అందిస్తుంది. సిగ్నేచర్ బీకాన్ లైట్లు, వెలుగులు నింపిన ఎంజీ లోగో, రోటర్ అలాయ్ వీల్స్ దీనికి ఆకర్షణీయమైన లుక్‌ను తెచ్చిపెట్టాయి. అలాగే ఆటోమేటిక్ పవర్ టైల్‌గేట్ సదుపాయం బూట్ ఏరియాను మరింత సులభంగా యాక్సెస్ చేసుకునే వీలు కల్పిస్తుంది.
Hector Tomahawk SUV | పవర్‌ట్రెయిన్ పనితీరు..
హెక్టర్ టొమాహాక్ EV మోడల్‌లో 69.2 kWh ‘ మ్యాజిక్’ బ్యాటరీని అమర్చారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఇది 517 కి.మీ.ల క్లెయిమ్డ్ రేంజ్‌ను అందిస్తుంది. అంతేకాకుండా 90 kW డిసి ఫాస్ట్ ఛార్జింగ్‌కు ఇది సపోర్ట్ చేస్తుంది. ఇక భారతదేశపు తొలి ప్లగ్-ఇన్ హైబ్రిడ్ (PHEV) వేరియంటైన హెక్టర్ టొమాహాక్ PHEVలో 20.5 kWh బ్యాటరీ ప్యాక్ ఉంది. ఇది 115 కి.మీ.లకు పైగా ప్యూర్-ఎలక్ట్రిక్ రేంజ్‌ను ఇస్తుంది. ఇంజిన్ , బ్యాటరీ కలిసి మొత్తం 1,100 కి.మీ. కంటే ఎక్కువ కంబైన్డ్ డ్రైవింగ్ రేంజ్‌ను అందిస్తాయి.
Hector Tomahawk SUV | ప్రత్యేక టెక్నాలజీ (V2H) ..
భారతదేశంలోనే తొలిసారిగా ఇందులో ‘Vehicle-to-Home’ (V2H) ఫీచర్‌ను పరిచయం చేశారు. దీని ద్వారా కారు బ్యాటరీని మొబైల్ పవర్ సోర్స్‌గా మార్చుకుని ఇంటి అవసరాలకు లేదా ఎలక్ట్రిక్ పరికరాలకు నేరుగా విద్యుత్తును అందించవచ్చు. అలాగే క్యాబిన్‌లో సెగ్మెంట్టే అతిపెద్దదైన 15.6 అంగుళాల HD టచ్‌స్క్రీన్, 10-స్పీకర్ ఇన్ఫినిటీ ఆడియో సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు ఉన్నాయి. హింగ్లిష్ కమాండ్లను అర్థం చేసుకునే ఏఐ (GenAI) వాయిస్ అసిస్టెంట్ , గెస్టర్ కంట్రోల్స్ (i-SWIPE) వంటి అధునాతన హంగులు ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తాయి.
Hector Tomahawk SUV | భద్రతా ప్రమాణాలు..
ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేస్తూ అన్ని వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లను స్టాండర్డ్‌గా అందించారు. వీటితో పాటు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ హోల్డ్ కంట్రోల్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, 360-డిగ్రీ కెమెరా వంటివి ఉన్నాయి. అదనంగా అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి ఫీచర్లతో కూడిన లెవల్-2 ADAS టెక్నాలజీని కూడా ఇందులో పొందుపరిచారు. నగరంలో పెరుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్‌కు తగినట్లుగా, ఈ అడ్వాన్స్‌డ్ ఎస్‌యూవీ కస్టమర్లకు సరికొత్త డ్రైవింగ్ అనుభూతిని అందించనుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.
ఇది కూడా చదవండి: BRICS Summit | బ్రిక్స్ సదస్సుపై దక్షిణాఫ్రికా అధ్యక్షుడి కీలక వ్యాఖ్యలు