అక్షరటుడే, వెబ్డెస్క్ : Tirumala Brahmotsavam | తిరుమల (Tirumala) శ్రీవారి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ నెల 23వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేశారు.
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తారు. బ్రహ్మోత్సవాల వేళ లక్షలాది మంది తిరమలను దర్శించుకుంటారు. ఈ క్రమంలో టీటీడీ అధికారులు భక్తులకు ఇబ్బందులు లేకుండా ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. సోమవారం సాయంత్రం బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. నేడు సాయంత్రం సీఎం చంద్రబాబు నాయుడు ఉత్సవాలను ప్రారంభించనున్నారు.
Tirumala Brahmotsavam | ఆర్జిత సేవలు రద్దు
బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఈ నెల 23 వరకు ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేశారు. వీఐపీ బ్రేక్ దర్శనాలు, ప్రత్యేక దర్శనాలు, శ్రీవాణి దర్శనాలను సైతం రద్దు చేశారు. 20వ తేదీ వరకు తిరుపతిలో సర్వదర్శనం భక్తులకు జారీ చేసే టోకెన్లు సైతం క్యాన్సిల్ చేశారు.
Tirumala Brahmotsavam | ఘనంగా అంకురార్పణ
బ్రహ్మోత్సవాలకు సోమవారం రాత్రి అంకురార్పణ నిర్వహించారు. ఆలయంలోని యాగశాలలో ఈ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా చేపట్టారు. అనంతరం శ్రీవారి సర్వసైన్యాధ్యక్షుడు శ్రీవిష్వక్సేనుడు నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు చేపట్టారు. మంగళవారం సీఎం చంద్రబాబు దంపతులు శ్రీవారిని దర్శించుకుంటారు. సాయంత్రం ధ్వజారోహణంతో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను సీఎం ప్రారంభిస్తారు. రాత్రి 8 గంటలకు ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి దర్శించుకోనున్నారు. రాత్రి ఆయన తిరుమలలోనే బస చేస్తారు.
ఇది కూడా చదవండి..: TTD Bhanu Prakash Reddy | మట్టి గణపతులనే పూజిద్దాం – పర్యావరణాన్ని కాపాడుకుందాం: టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాశ్ రెడ్డి