Telangana Praja Palana Day | రాచరిక వ్యవస్థ నుంచి విముక్తి పొంది ప్రజాపాలనలోకి : మహిళా కమిషన్ ఛైర్​పర్సన్​ నేరేళ్ల శారద

తెలంగాణ సాయుధ పోరాట ఫలితంగా నిరంకుశ పాలన అంతమై 17 సెప్టెంబర్ 1948న ప్రజాపాలనలోకి వచ్చిందని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్మన్ నేరేళ్ల శారద అన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి : Telangana Praja Palana Day | తెలంగాణ సాయుధ పోరాట ఫలితంగా నిరంకుశ పాలన అంతమై 17 సెప్టెంబర్ 1948న ప్రజాపాలనలోకి వచ్చిందని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్​పర్సన్​ నేరేళ్ల శారద అన్నారు. బుధవారం కామారెడ్డి (Kamareddy)లో జరిగిన తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

Telangana Praja Palana Day | వందల ఏళ్ల చరిత్ర..

అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. తెలంగాణలో జరిగిన పోరాటం మూడు వందల ఏళ్ల చరిత్రగా కీర్తించబడుతోందని, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన 48 గంటల నుంచే అమలు చేయడం ప్రారంభించిందని తెలిపారు. జిల్లాలో ఈ వానాకాలం సీజన్​లో 5,53,437 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశామని, ఇందిరమ్మ రైతు భరోసా కింద 3,6,890 మంది రైతుల ఖాతాల్లో రూ.305.72 కోట్లు జమ చేశామన్నారు. 50 శాతం రాయితీపై విత్తనాలు, 100 శాతం రాయితీపై సోయా విత్తనాలు అందించామని పేర్కొన్నారు. ఆయిల్ పామ్ సాగులో 13 వేల ఎకరాల లక్ష్యంలో 1,233 ఎకరాలకు అనుమతి ఇచ్చి 453 ఎకరాల్లో మొక్కలు నాటడం పూర్తి చేశామని వివరించారు. 43 వేల 591 కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసి 1,30,733 మందికి లబ్ధి చేకూర్చామని, రూ.500 లకే గ్యాస్ సిలిండర్ పథకం కింద లక్షా 51 వేల 520 మందికి 10,76,000వేల సిలిండర్లు ఇచ్చి రూ.33.28 కోట్ల రాయితీ అందించామన్నారు.

Telangana Praja Palana Day | ఆసరా పింఛన్లు..

ఆసరా పింఛన్ల కింద 1,55,000 మందికి నెలకు రూ.37.61 కోట్లు అందిస్తున్నామని తెలిపారు. మహిళా సంఘాలకు బ్యాంకు అనుసంధానం ద్వారా రూ.328.70 కోట్లు, పట్టణ సంఘాలకు రూ.42కోట్లు రుణ సహాయం అందించామన్నారు. వడ్డీ లేని రుణాల కింద మహిళలకు రూ.273 కోట్ల లబ్ధి చేకూరిందన్నారు. వన మహోత్సవంలో 22.39 లక్షల మొక్కలు నాటామని, గృహజ్యోతి కింద 1,75,306 మందికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని, ఇందిరమ్మ ఇళ్ల కింద 3,612 ఇళ్లు మంజూరు చేసి 11,964 ఇళ్ల నిర్మాణం ప్రారంభించామన్నారు. విద్య, వైద్యం, రోడ్లు, ఆపరేషన్ కవచ్ లాంటి కార్యక్రమాలతో జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామన్నారు. అంతకుముందు హౌజింగ్ బోర్డు వద్ద ఉన్న అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్ర, గ్రంథాలయ ఛైర్మన్ చంద్రకాంత్ రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ ఇప్ప ఉమారాణి, డీఎఫ్​వో నీరజ్ కుమార్, అడిషనల్ కలెక్టర్లు గిరి, విక్టర్, అడిషనల్ ఎస్పీ నర్సింహారెడ్డి, ఆయా శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Lakshmikantha Rao | ప్రజల సమస్యలను పరిష్కరిస్తాం: ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *