అక్షరటుడే, వెబ్‌డెస్క్: Sep 18 Market Analysis | ఓవైపు పశ్చిమాసియా(West Asia)లో ఉద్రిక్తతలను తగ్గించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంకోవైపు డ్రోన్ దాడుల అనంతరం గత వారం మూసివేసిన కీలకమైన తూర్పు-పశ్చిమ పైప్‌లైన్ సామర్థ్యాన్ని కొద్ది రోజుల్లోనే దాదాపు సగానికి పునరుద్ధరించడానికి సౌదీ అరేబియా ప్రయత్నిస్తోంది.
మరోవైపు ప్రపంచ నౌకా రవాణా, ఇంధన మార్కెట్లకు కీలకమైన బాబ్ ఎల్-మండేబ్(Bab al-Mandab Strait) చుట్టూ నెలకొన్న అంతరాయాలను తగ్గించేందుకు యెమెన్ హౌతీ మిలిటెంట్లను అదుపులోకి తీసుకురావడానికి ఇరాన్ సహాయం చేయాలని చైనా కోరిందన్న సమాచారంతో క్రూడ్ ఆయిల్ ధర దిగివస్తోంది. దీంతో గ్లోబల్ మార్కెట్లు గ్రీన్ లో ట్రేడ్ అవుతున్నాయి.
Sep 18 Market Analysis | యూఎస్ మార్కెట్లు..
గత సెషన్లో నాస్డాక్ 1.69 శాతం, ఎస్ అండ్ పీ 1.14 శాతం పెరిగాయి. శుక్రవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.13 శాతం లాభంతో ఉంది.
Sep 18 Market Analysis | యూరోప్ మార్కెట్లు..
ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 0.57 శాతం, జర్మనీకి చెందిన డీఏఎక్స్ 0.70 శాతం, యూకేకు చెందిన ఎఫ్టీఎస్ ఈ 1.18 లాభపడ్డాయి.
Sep 18 Market Analysis | ఆసియా మార్కెట్లు..
ప్రధాన ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. ఉదయం 8 గంటల ప్రాంతంలో సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 2.03 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 1.06 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 0.84 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.71 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 0.63 శాతం లాభాలతో ఉండగా.. సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.33 శాతం నష్టంతో కదలాడుతోంది. గిఫ్ట్ నిఫ్టీ 0.03 శాతం లాభంతో ఉండడంతో మన మార్కెట్లు ఫ్లాట్ టు గ్యాప్ అప్ లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
Nizamabad DMHO Corruption | నిజామాబాద్ జిల్లా వైద్యారోగ్య శాఖలో కాసుల వేట.. ‘చేయి తడిపితేనే’ పని!
గమనించాల్సిన అంశాలు..
- విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు ఏడో సెషన్లోనూ నికర అమ్మకందారులుగా ఉన్నారు. గత సెషన్లో నికరంగా రూ. 3,208 కోట్ల విలువైన స్టాక్స్ అమ్మారు.
- డీఐఐలు వరుసగా 27 వ సెషన్లోనూ నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. గత సెషన్లో నికరంగా రూ. 3,617 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు.
- డాలర్‌తో రూపాయి మారకం విలువ 3 పైసలు బలపడి 95.93 వద్ద ఉంది.
- యూఎస్ డాలర్ ఇండెక్స్ 100.22 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.94 వద్ద ఉన్నాయి.
- క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 104.17 డాలర్ల వద్ద ఉంది.
- నిఫ్టీ పుట్‌కాల్ రేషియో 0.96 నుంచి 0.99 కు పెరిగింది.
- విక్స్ 6.66 శాతం తగ్గి 12.29 వద్ద ఉంది.