Sep 18 Horoscope | అరుదైన యోగాల కలయిక.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దిన, వార, సంవత్సర రాశి ఫలాలను పండితులు అందిస్తుంటారు. ఇక్కడ ఇచ్చినవి నేటి రాశి ఫలాలు... రాశుల వారీగా వాటిని తెలుసుకుందాం..

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Sep 18 Horoscope | జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, శుక్రవారం రోజు చంద్రుడు ధనస్సు రాశిలో సంచరిస్తూ, జ్యేష్ఠ నక్షత్ర ప్రభావం ద్వాదశ రాశులపై ఉండనుంది.

ఇదే సమయంలో కుజుడు మిథునం నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశించి, అక్కడ గురుడితో కలయిక జరపనున్నాడు. ఈ గ్రహ కలయిక వల్ల నీచభంగ రాజయోగం, ప్రీతి, ఆయుష్మాన్ యోగాలు ఏర్పడనున్నాయి.

Sep 18 Horoscope | రాశుల వారీగా..

మేష రాశి: Sep 18 Horoscope | ఈ రాశివారు ఇవాళ చాలా అప్రమత్తంగా ఉండాలి. కుటుంబపరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త అవసరం. స్థిరాస్తుల వివాదాలు తలెత్తే అవకాశం ఉంది, అలాగే తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి.

వ్యాపారస్తులు మెరుగైన ఫలితాలు అందుకుంటారు. ఉద్యోగులు ఆఫీస్‌లో జాగ్రత్తగా ఉండాలి, సహోద్యోగుల నుంచి సహకారం లభించడం కష్టమే. గురు గ్రహ అనుగ్రహంతో పరిస్థితులు కాలక్రమేణా మెరుగవుతాయి.

వృషభ రాశి: Sep 18 Horoscope | ఈ రాశి వారికి కుజుడి తృతీయ స్థాన సంచారం కారణంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కుటుంబ జీవితంలో కాస్త జాగ్రత్త అవసరం. వైవాహిక జీవితం సంతోషంగా సాగుతుంది. వ్యాపారస్తులకు మంచి లాభాలు, ఆర్థిక బలపడే అవకాశం ఉంది. పెండింగ్ పనులు పూర్తవుతాయి. అయితే, ఆన్‌లైన్ లావాదేవీల్లో మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇవాళ కనకధార స్తోత్రం పఠించండి.

మిథున రాశి: Sep 18 Horoscope | కుజుడు, గురుడు ఈ రాశి నుంచి ద్వితీయ స్థానంలో కలయిక జరుపుతుండటం వల్ల కొన్ని ప్రతికూల ఫలితాలు ఎదురుకావచ్చు. మాటలపై సంయమనం చాలా ముఖ్యం. ఆరోగ్యం, ముఖ్యంగా ఆహారపు అలవాట్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. అయితే, రోజు చివరి వరకు రావాల్సిన బకాయిలు చేతికి అందే అవకాశం ఉంది.

కర్కాటక రాశి: Sep 18 Horoscope | గురు-కుజుల కలయిక ఈ రాశి వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. వ్యాపారంలో ఊహించిన లాభాలు, పెట్టిన పెట్టుబడులకు మంచి రాబడి లభిస్తుంది. ఉద్యోగులకు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తవుతాయి. ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది. మీ నాయకత్వ లక్షణాలు వెలుగులోకి వస్తాయి, ప్రభావవంతమైన వ్యక్తుల పరిచయాలు మేలు చేస్తాయి.

సింహ రాశి: Sep 18 Horoscope | కుజ, గురుల ప్రభావంతో ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు అందుతాయి. కుజుడు పన్నెండో స్థానంలో సంచరిస్తున్నా, ఉద్యోగంలో మంచి విజయాలు సాధిస్తారు. వ్యాపారస్తులకు రోజు అనుకూలంగా ఉంటుంది. ఇవాళ చేపట్టే ప్రయాణాలు శుభ ఫలితాలను ఇస్తాయి. గణేష్ చాలీసా పఠించండి.

కన్యా రాశి: Sep 18 Horoscope | గురు-కుజుల కలయిక వలన వీరికి అద్భుతమైన శుభాలను తెస్తుంది. వ్యాపారంలో భారీ లాభాలు కలుగుతాయి. తోబుట్టువులతో సంబంధాలు మెరుగై, కుటుంబంలో విభేదాలు తొలగిపోతాయి. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణిస్తారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యంపై మాత్రం శ్రద్ధ వహించండి.

తులా రాశి: Sep 18 Horoscope | వీరికి ఇవాళ అన్ని విషయాల్లోనూ శుభ ఫలితాలు కలుగుతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఇది చాలా మంచి సమయం. వ్యాపారస్తులకు లాభాలు వస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆఫీస్‌లో సహోద్యోగుల నుంచి ఆశించిన సహకారం అందుతుంది. ఇవాళ లక్ష్మీదేవిని పూజించండి.

ఇది కూడా చదవండి: Nizamabad DMHO Corruption | నిజామాబాద్ జిల్లా వైద్యారోగ్య శాఖలో కాసుల వేట.. ‘చేయి తడిపితేనే’ పని!

వృశ్చిక రాశి: Sep 18 Horoscope | కుజ, గురుల సంయుక్త అనుగ్రహంతో వీరికి సానుకూల రోజు ఇది. ఉద్యోగులకు కార్యాలయంలో గొప్ప ఫలితాలు దక్కుతాయి. కష్టపడి పనిచేస్తే మంచి గుర్తింపు వస్తుంది. వ్యాపారస్తులు పురోగతి సాధిస్తారు. కుటుంబ జీవితం సంతోషంగా సాగుతుంది. ఆరోగ్యంపై మాత్రం శ్రద్ధ పెట్టడం మంచిది.

ధనస్సు రాశి: ఇవాళ వీరికి అత్యంత అనుకూలంగా ఉంటుంది. గురు-కుజుల ఆశీస్సులతో ఏ పని తలపెట్టినా విజయం సాధిస్తారు. అయితే, వాహనం నడిపేటప్పుడు మాత్రం జాగ్రత్తలు పాటించాలి. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. విద్యార్థులు గురువుల, సీనియర్ల సలహాలు తీసుకుని ముందుకు వెళ్లాలి. వ్యాపార, ఆరోగ్య పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. కనకధార స్తోత్రం పఠించండి.

మకర రాశి: కుజుడి ప్రభావం కారణంగా మకర రాశి వీరికి కొన్ని మిశ్రమ ఫలితాలు ఎదురుకావచ్చు. ఉద్యోగంలో కొద్దిగా నిరాశ, వ్యాపారంలో ఆశించిన లాభాలు రాకపోవడం వంటివి జరగవచ్చు. ఆర్థిక పరిస్థితి కాస్త మందగించవచ్చు. మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి. అయితే గురుడి మద్దతు వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. పెట్టుబడుల ద్వారా రాబడి ఉంటుంది, ఆరోగ్యం కుదుటపడుతుంది.

కుంభ రాశి: రాహు, కుజ, గురు గ్రహాల అనుగ్రహంతో ఈ రాశి వారికి అన్ని విధాలా శుభప్రదంగా ఉంది. విద్యార్థులు పోటీ పరీక్షలలో అద్భుతమైన విజయం సాధిస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్ లభించే బలమైన అవకాశాలున్నాయి. వ్యాపారంలో భారీ లాభాలు వచ్చి ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. కుటుంబంలో వివాదాలు సమసిపోయి సంతోషం వెల్లివిరుస్తుంది.

మీన రాశి: ఇవాళ వీరికి విశేషమైన ఫలితాలను ప్రసాదిస్తుంది. వ్యాపారంలో మంచి లాభాలతో ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ఉద్యోగులకు ప్రమోషన్‌కు సంబంధించిన శుభవార్తలు వినే అవకాశం ఉంది. కొత్త పరిచయాలు ఏర్పడి, భవిష్యత్తులో వాటి ద్వారా అనేక ప్రయోజనాలు కలుగుతాయి.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *