Danam Nagender | సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచన లేదు.. దానం నాగేందర్​ కీలక వ్యాఖ్యలు

హైకోర్టు తీర్పును గౌరవిస్తున్నట్లు దానం నాగేందర్​ తెలిపారు. సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచన లేదని చెప్పారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Danam Nagender | హైకోర్టు (High Court) తీర్పుపై దానం నాగేందర్​ స్పందించారు. న్యాయస్థానం తీర్పును గౌరవిస్తున్నట్లు తెలిపారు. సుప్రీంకోర్టు (Supreme Court)కు వెళ్లే ఆలోచన లేదని పేర్కొన్నారు.

దానం నాగేందర్​ పార్టీ ఫిరాయింపు పిటిషన్​పై విచారణ చేపట్టిన ధర్మాసనం శుక్రవారం తుది తీర్పు వెలువరించింది. ఆయనపై అనర్హత వేటు వేస్తూ.. ఖైరతాబాద్​ సీటు ఖాళీ అయినట్లు ప్రకటించింది. దీనిపై దానం మాట్లాడుతూ.. ఉప ఎన్నికలు వస్తే పోటీ చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. యుద్ధం తనకేం కొత్త కాదని చెప్పారు. మళ్లీ పోరాడుతా.. మళ్లీ గెలుస్తా అని ధీమా వ్యక్తం చేశారు.

Danam Nagender | ఉప ఎన్నిక తప్పదా..

దానం నాగేందర్ ఖైరతాబాద్​ ఎమ్మెల్యేగా బీఆర్​ఎస్ (BRS)​ నుంచి పోటీ చేసి గెలిచారు. అనంతరం ఆయన కాంగ్రెస్​ గూటికి చేరారు. అంతేగాకుండా ఆ పార్టీ సీటుపై ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆయనతో పాటు పది మంది బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు పార్టీ మారారు. అయితే దీనిపై విచారణ చేపట్టిన స్పీకర్​ పార్టీ మారినట్లు ఆధారాలు లేవని పిటిషన్లను కొట్టివేశారు. మిగతా వారు సాంకేతిక కారణాలతో తప్పించుకన్నా.. దానం నాగేందర్​ ఎంపీగా పోటీ చేయడంతో బీఆర్​ఎస్​, బీజేపీ ఈ విషయంపై హైకోర్టును ఆశ్రయించాయి. దీంతో సుదీర్ఘ విచారణ చేపట్టిన ధర్మాసనం ఆయనపై వేటు వేసింది. తాను సుప్రీంకోర్టుకు వెళ్లనని దానం ప్రకటించడంతో.. త్వరలో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది.

ఈ వీడియో చూడండి :

దీనిని కూడా చదవండి : Harish Rao Danam Nagender | దానంపై అనర్హత వేటు.. కాంగ్రెస్ తీరుపై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *