DUSU Elections | ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో ఏబీవీపీ ఆధిక్యం

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : DUSU Elections | ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్​ యూనియన్​ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 17వ రౌండ్ ముగిసే సమయానికి, అధ్యక్ష పదవి రేసులో ఏబీవీపీ (ABVP)కి చెందిన యశ్ దబాస్ 20,151 ఓట్లతో ముందంజలో ఉన్నారు. ఎన్​ఎస్​యూఐకి చెందిన విజయ్ మీనా 19,651 ఓట్లతో ఆయనకు దగ్గరగా ఉన్నారు. యశ్ దబాస్ 500 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

ఉపాధ్యక్ష పదవికి సంబంధించి స్వతంత్ర అభ్యర్థి దీపాంశు షోకీన్ 26,341 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. ఏబీవీపీ అభ్యర్థి ఇషు మౌర్య 13,655 ఓట్లతో రెండో స్థానంలో ఉండగా, ఎన్​ఎస్​యూఐకి చెందిన వీర్ ఛత్రత్ 3,698 ఓట్లు సాధించారు. అధ్యక్ష పదవి ఫలితాలు తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. ఇద్దరు అభ్యర్థుల మధ్య ఆధిక్యం దోబూచులాడుతోంది. ఇద్దరి మధ్య స్వల్ప తేడా ఉండటంతో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ నెలకొంది. కాగా ఉపాధ్యక్ష పదవిని స్వతంత్ర అభ్యర్థి గెలుచుకునే అవకాశం ఉంది.

DUSU Elections | యశ్​ దబాస్ నేపథ్యం

ఏబీవీపీ నుంచి అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న యశ్ దబాస్ ఆరేళ్లుగా ఏబీవీపీలో కీలకంగా పని చేస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ అనుభవం ఉన్న టెన్నిస్ క్రీడాకారుడు కూడా. ఆల్ ఇండియా, ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్‌లో ఢిల్లీ విశ్వవిద్యాలయానికి ప్రాతినిధ్యం వహించారు. ఆస్ట్రేలియా, స్పెయిన్, సెర్బియా వంటి దేశాలలో జరిగిన అంతర్జాతీయ టెన్నిస్ ఫెడరేషన్ (ITF) టోర్నమెంట్లలో పాల్గొన్నాడు.

దీనిని కూడా చదవండి : Home Guard Arrested | మహిళపై దాడి చేసిన హోమ్​గార్డు అరెస్ట్

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *