GST Collections May | మేలో జీఎస్టీ వసూళ్లు రూ.1.94 లక్షల కోట్లు..

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్ : GST Collections May | దేశంలోని వస్తు, సేవల పన్ను వసూళ్లు మే నెలలో స్థిరమైన వృద్ధిని నమోదు చేశాయి. దేశవ్యాప్తంగా స్థూల జీఎస్టీ వసూళ్లు రూ. 1,94,184 కోట్లకు చేరుకున్నాయి. గతేడాది ఇదే కాలంలో పోల్చి చూస్తే ఈసారి పన్ను వసూళ్లు 3.2 శాతం పెరిగాయి. మే 2025లో స్థూల జీఎస్టీ వసూళ్లు రూ. 1,88,172 కోట్లుగా ఉన్నాయి.

మే 2026లో స్థూల జీఎస్టీ (GST) రూ. 1.94 లక్షల కోట్లు కాగా.. రిఫండ్ల సర్దుబాటు అనంతరం నికర ఆదాయం రూ. 1,66,904 కోట్లని కేంద్ర ఆర్థిక శాఖ చెబుతోంది. ఈ నికర ఆదాయాల పెరుగుదల దేశీయంగా వ్యాపార లావాదేవీలు స్థిరంగా సాగుతున్నాయనడానికి స్పష్టమైన సంకేతంగా నిలుస్తోంది.

GST Collections May | పెరిగిన రీఫండ్లు..

GST Collections May

రీఫండ్లు గతేడాదితో పోల్చితే 2.6 శాతం పెరిగి రూ. 27,281 కోట్లుగా నమోదయ్యాయి. అయితే దేశీయ రీఫండ్లు 4.3 శాతం తగ్గగా.. ఎగుమతి ఆధారిత రీఫండ్లు 16.6 శాతం పెరిగాయి. గతేడాదితో పోలిస్తే స్థూల దేశీయ జీఎస్టీ రాబడి 2.6 శాతం తగ్గింది. ఈ మొత్తం రూ.1.34 లక్షల కోట్లు. ఇదే సమయంలో దిగుమతులపై వసూళ్లు 19.1 శాతం పెరిగి, రూ.59,654 కోట్లకు చేరాయి.

GST Collections May | ఏప్రిల్ లో ఆల్ టైం హై..

GST Collections May

ఏప్రిల్ 2026లో రూ. 2,42,702 కోట్లతో జీఎస్టీ వసూళ్లు ఆల్ టైం హైని తాకాయి. సాధారణంగా మార్చి నెల ముగింపు (ఆర్థిక సంవత్సరాంతం) తర్వాతి నెల అయిన ఏప్రిల్‌లో పన్ను వసూళ్లు గణనీయంగా పెరుగుతాయి. ఆ రికార్డు స్థాయి వసూళ్ల తర్వాత మే నెలలో రూ. 1.94 లక్షల కోట్లు రావడం ఆర్థిక వ్యవస్థ స్థిరత్వాన్ని ప్రతిబింబిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27) ప్రారంభ త్రైమాసిక ప్రగతిని పరిశీలిస్తే.. మొదటి రెండు నెలల్లో కలిపి దేశవ్యాప్తంగా పన్ను వసూళ్లు 6.2 శాతం వృద్ధితో ఏకంగా రూ. 4.37 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఆర్థిక సంవత్సరం ఆరంభంలోనే ఈ స్థాయి వసూళ్లు నమోదు కావడం ప్రభుత్వానికి పెద్ద ఊరటనిచ్చే విషయం.

ఇది కూడా చదవండి..: Rajya Sabha Elections | 24 రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల..

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *