Jurala Project Left Canal | మహబూబ్‌నగర్‌లో ఉద్రిక్తత.. జూరాల ఎడమ కాలువ గేట్లు స్వయంగా ఎత్తి నీటిని విడుదల చేసుకున్న రైతులు!

రిజర్వాయర్‌లో ఉన్న నీరు కేవలం తాగునీటి అవసరాలకు మాత్రమే సరిపోతుందని, సాగునీటికి నీటిని విడుదల చేయడం సాధ్యం కాదని వివరించే ప్రయత్నం చేశారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Jurala Project Left Canal | ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. పంట పొలాలకు, ఆయకట్టుకు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉదయం నుంచే ఆందోళన చేపట్టిన రైతులు.. అధికారుల స్పందన లేకపోవడంతో ఆగ్రహానికి గురై స్వయంగా ప్రాజెక్ట్ ఎడమ కాలువ గేట్లను ఎత్తి నీటిని విడుదల చేసుకున్నారు.

Jurala Project Left Canal | ఉదయం నుంచి రైతుల నిరసన..

ఎండిపోతున్న తమ పంటలను కాపాడుకునేందుకు కాలువల ద్వారా ఆయకట్టుకు నీరు విడుదల చేయాలని కోరుతూ పరీవాహక ప్రాంత రైతులు ఉదయం నుంచే జూరాల ప్రాజెక్ట్ వద్ద ధర్నాకు దిగారు. కాలువలకు నీటిని వదిలి తమను ఆదుకోవాలని వారు అధికారులను, నిరసన వేదికగా డిమాండ్ చేశారు.

Samantha Seemantham | సీమంతంలో శ్రీవిద్యా సొబగులు..కళా ఆవరణలో మాతృత్వానికి దైవత్వపు అభిషేకం!

అయితే ప్రాజెక్ట్ అధికారులు మాత్రం ఎగువ ప్రాంతాల నుంచి ప్రస్తుతం ఎలాంటి వరద నీటి ప్రవాహం (ఇన్‌ఫ్లో) లేదని రైతులకు స్పష్టం చేశారు. రిజర్వాయర్‌లో ఉన్న నీరు కేవలం తాగునీటి అవసరాలకు మాత్రమే సరిపోతుందని, సాగునీటికి నీటిని విడుదల చేయడం సాధ్యం కాదని వివరించే ప్రయత్నం చేశారు.

Jurala Project Left Canal | ఆగ్రహించిన అన్నదాతలు..

అధికారుల సమాధానంతో తీవ్ర అసంతృప్తికి గురైన రైతులు, అధికారుల మాటలతో ఏకీభవించలేదు. తీవ్ర ఆగ్రహానికి గురైన ఆందోళనకారులు ఒక్కసారిగా ప్రాజెక్ట్ వైపు దూసుకెళ్లి, ఎడమ కాలువ గేట్లను స్వయంగా ఎత్తి నీటిని కిందకు వదిలారు.

సమాచారం అందుకున్న పోలీసులు, నీటిపారుదల శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. దీంతో జూరాల ప్రాజెక్ట్ ప్రాంతంలో కొంతసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *