Mamnoor Airport Name Suggestions | వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఏ పేరు పెడదాం? సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్.. ‘సందీప్ రెడ్డి వంగా’ పవర్ ఫుల్ కామెంట్స్!

స్వగ్రామమైన వరంగల్‌లో ఎయిర్‌పోర్ట్ కలను నిజం చేస్తున్నందుకు ముఖ్యమంత్రికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Mamnoor Airport Name Suggestions | ఓరుగల్లు వాసుల దశాబ్దాల నాటి విమానాశ్రయ స్వప్నం నెరవేరబోతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మామునూరు ఎయిర్‌పోర్ట్ నిర్మాణం వేగంగా కార్యరూపం దాలుస్తుండటంతో తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది.

ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా చేసిన ఒక ప్రకటన, దానికి టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఇచ్చిన రిప్లై ప్రస్తుతం నెట్టింట తీవ్ర వైరల్​ అవుతోంది.

Mamnoor Airport Name Suggestions | పేరు సూచించాలన్న సీఎం

మామునూరు ఎయిర్‌పోర్టుకు సంబంధించి తెలంగాణ సర్కారు ఇప్పటికే రూ.295 కోట్ల వ్యయంతో భూసేకరణ ప్రక్రియను పూర్తి చేసి, దానిని ‘ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా’ (AAI)కి అప్పగించింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేస్తూ.. “వరంగల్ ప్రజల కల నెరవేరే సమయం వచ్చింది.

ఈ ప్రాంత పరిశ్రమలు, పర్యాటకం, విద్య, ఉద్యోగావకాశాలకు ఈ ఎయిర్‌పోర్ట్ ఒక కొత్త ముఖద్వారంగా మారనుంది. మన కొత్త ఎయిర్‌పోర్టుకు ఏ పేరు పెడితే బాగుంటుందో ప్రజలే తమ అమూల్యమైన సూచనలు ఇవ్వాలి” అని కోరారు.

Mamnoor Airport Name Suggestions | స్పందించిన వంగా..

సీఎం రేవంత్ రెడ్డి పోస్టుపై వరంగల్ ముద్దుబిడ్డ, ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ చిత్రాల దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తక్షణమే స్పందించారు. స్వగ్రామమైన వరంగల్‌లో ఎయిర్‌పోర్ట్ కలను నిజం చేస్తున్నందుకు ముఖ్యమంత్రికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు.

Jurala Project Left Canal | మహబూబ్‌నగర్‌లో ఉద్రిక్తత.. జూరాల ఎడమ కాలువ గేట్లు స్వయంగా ఎత్తి నీటిని విడుదల చేసుకున్న రైతులు!

అంతేకాకుండా.. ఎయిర్‌పోర్టుకు వరంగల్ చారిత్రక, సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించేలా రాణి రుద్రమదేవి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (RIA – Rudrama International Airport), కాకతీయ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (KIA – Kakatiya International Airport) పేర్లను సూచించారు. కాకతీయుల శౌర్యం, వీరనారి రాణి రుద్రమదేవి సాహసాలు విశ్వవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయని, అలాంటి వీరగాథలకు ప్రతిరూపమైన పేర్లను ఖరారు చేస్తే ఎంతో గర్వకారణంగా ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *