Pakistan Airstrikes | అఫ్గానిస్థాన్‌పై పాకిస్థాన్ వైమానిక దాడి.. అర్ధరాత్రి బాంబుల వర్షం

పాకిస్థాన్ వాయుసేన మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. అర్ధరాత్రి వేళ తూర్పు అఫ్గానిస్థాన్‌పై పాక్ యుద్ధ విమానాలు విరుచుకుపడ్డాయి.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Pakistan Airstrikes | పాకిస్థాన్ వాయుసేన మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. అర్ధరాత్రి వేళ తూర్పు అఫ్గానిస్థాన్‌పై ( Afghanistan ) పాక్ యుద్ధ విమానాలు విరుచుకుపడ్డాయి. సరిహద్దుకు సమీపంలో ఉన్న కునార్, పక్తికా ప్రాంతాలపై పాక్ జెట్లు బాంబుల వర్షం కురిపించడంతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. కునార్ ప్రావిన్స్‌లోని నూర్గల్ జిల్లా పతంగ్ ప్రాంతంలో రాత్రి సుమారు 3:30 గంటల సమయంలో ఈ దాడి జరిగింది. చాలా తక్కువ ఎత్తులో దూసుకొచ్చిన పాకిస్థాన్ యుద్ధ విమానాలు సాధారణ పౌరుల ఇళ్లను లక్ష్యంగా చేసుకుని బాంబులు జారవిడిచాయి. ఈ దాడిలో నూర్ మహమ్మద్ అనే స్థానికుడి ఇల్లు పూర్తిగా ధ్వంసమై మట్టిదిబ్బలా మారిపోయింది.

Pakistan Airstrikes | ఆస్పత్రికి తరలింపు..

బాంబుల తాకిడికి తీవ్రంగా గాయపడిన పలువురు క్షతగాత్రులను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే దాడి జరిగిన సమయంలో ఇళ్లలో ఎంతమంది ఉన్నారు, ఎంత మేర ప్రాణనష్టం జరిగిందనే పూర్తి వివరాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఘటనా స్థలంలో పేలిపోయిన బాంబుల శకలాలను స్థానికులు సేకరించారు. గత కొంతకాలంగా పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. ఈ పరిస్థితుల నడుమే పాక్ అర్ధరాత్రి హఠాత్తుగా వైమానిక దాడికి పాల్పడటం గమనార్హం. ప్రజలంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో జరిగిన ఈ దాడితో అఫ్గాన్ సరిహద్దు గ్రామాల్లో భయానక వాతావరణం నెలకొంది. ఈ వైమానిక దాడికి సంబంధించిన పూర్తి నష్ట వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఇది కూడా చదవండి:  YSRCP Protest Vijayawada | వైసీపీ ధర్నా.. విజయవాడలో ఉద్రిక్తత

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *