అక్షరటుడే, వెబ్‌డెస్క్ : IIT Bombay Student Suicide | బాంబే ఐఐటీ (IIT Bombay)లో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. పరీక్షల్లో చీటింగ్ చేస్తున్న అతడిని పట్టుకోవడంతో మనస్తాపంతో తనువు చాలించాడు. దీనిపై విద్యార్థులు నిరసన తెలుపుతున్నారు. ఈ క్రమంలో సంస్థ నిరసనకారులతో భేటీ అయింది.
నిరసన చేస్తున్న విద్యార్థుల 18 డిమాండ్లతో కూడిన పత్రంపై ఐఐటీ బొంబాయి డైరెక్టర్ శిరీష్ కేదార్ సంతకం చేశారు. దీంతో ఈ సమస్యకు పరిష్కారం లభించే అవకాశం ఉంది. పరీక్షల్లో చాట్ జీపీటీ ఉపయోగిస్తు గత శుక్రవారం సాహిల్ అనే విద్యార్థి పట్టుబడ్డాడు. అనంతరం అతడు తన గదిలోకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. నిబంధనలను ఉల్లంఘించి సదరు విద్యార్థి పరీక్షల్లో ఫోన్ ఉపయోగించాడని సంస్థ తెలిపింది. ఇన్విజిలేటర్ సూర్యనారాయణ దూల్లా సంస్థాగత నియమాలను పాటించారని పేర్కొంది.
IIT Bombay Student Suicide | స్వతంత్ర విచారణకు డిమాండ్
క్యాంపస్‌లో వాకోడే వేధింపులకు, కుల ఆధారిత వివక్షకు గురయ్యాడని, అందుకే ఆత్మహత్య చేసుకున్నాడని నిరసనకారులు, విద్యార్థి కుటుంబం ఆరోపించింది. కాగా నిరసనకారులు సంస్థ ముందు 18 డిమాండ్లు ఉంచారు. అకడమిక్ కమిటీలలో విద్యార్థులకు ప్రాతినిధ్యం కల్పించాలని, ఆత్మహత్యల కేసులపై స్వతంత్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వీటిపై నేడు ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
IIT Bombay Student Suicide | ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు
కాగా విద్యార్థి తల్లిదండ్రులు ఈ ఘటనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. విద్యా సంస్థ నిబంధనల ప్రకారమే ప్రొఫెసర్ ఈ ఘటనపై చర్య కోసం సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారని ఫ్యాకల్టీ ఫోరం స్పష్టం చేసింది. ఆయనకు సంఘీభావం తెలిపింది.పరీక్ష సమయంలో విద్యార్థి అనధికారికంగా స్మార్ట్‌ఫోన్‌ను తన వెంట ఉంచుకుని, ఉపయోగించారని పేర్కొంది. కాగా ఈ విషయమై నెటిజన్లు సైతం భిన్నంగా స్పందిస్తున్నారు. చీటింగ్ చేస్తున్న విద్యార్థిని పట్టుకున్న ప్రొఫెసర్‌పై కేసు పెడితే.. భవిష్యత్‌లో టీచర్లు భయపడే పరిస్థితులు వస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..: SBI Bank Strike | మూడు రోజుల పాటు బ్యాంకర్ల సమ్మె.. కస్టమర్లకు ఎస్బీఐ కీలక సూచన