Ganjai Seized Malkajgiri | 28 కిలోల గంజాయి స్వాధీనం.. ముగ్గురి అరెస్ట్​

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Ganjai Seized Malkajgiri | మల్కాజ్‌గిరిలో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఎక్సైజ్ పోలీసులు 28 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులను అరెస్ట్​ చేశారు.

హైదరాబాద్​ (Hyderabad) నగరంలో గంజాయి దందా జోరుగా సాగుతోంది. పోలీసులు, ఈగల్​ ఫోర్స్​, ఎక్సైజ్​ అధికారులు దాడులు చేస్తున్నా.. గంజాయి విక్రయాలు ఆగడం లేదు. ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి నగరంలో విక్రయాలు చేపడుతున్నారు. యువత, విద్యార్థులు ఈ మాదకద్రవ్యానికి బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో పోలీసులు గంజాయి రవాణాను అరికట్టేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా తనిఖీలు చేపట్టగా తాజాగా ముగ్గురు దొరికారు.

Ganjai Seized Malkajgiri | ఆటోస్టాండ్​ వద్ద

మల్కాజ్‌గిరి ఎన్‌ఫోర్స్‌మెంట్ అసిస్టెంట్ కమిషనర్ ఆధ్వర్యంలో ఆర్.కె. నగర్ ఆటో స్టాండ్ వద్ద సోదాలు నిర్వహించారు. పశ్చిమ బెంగాల్​కు చెందిన బప్పా అనే వ్యక్తి గంజాయి తరలిస్తుండగా పట్టుకున్నారు. అతడి నుంచి 7.163 కిలోల ఎండు గంజాయి, ఒక సెల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

Ganjai Seized Malkajgiri | ఇద్దరు మహిళల అరెస్ట్​

సికింద్రాబాద్‌లోని పాస్‌పోర్ట్ కార్యాలయం సమీపంలో మల్కాజ్‌గిరి జిల్లా టాస్క్ ఫోర్స్ సిబ్బంది తనిఖీలు చేపట్టారు. పక్కా సమాచారం మేరకు దాడి గంజాయి తరలిస్తున్న ఇద్దరు మహిళలను అరెస్ట్​ చేశారు. తమిళనాడులోని మదురైకి చెందిన ఇందు రాణి, రాజమ్మల్ పంజగం అనే ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 21 కిలోల గంజాయి, 3 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. రెండు కేసుల్లో నిందితులు విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతం నుంచి ఈ గంజాయిని తీసుకు వచ్చినట్లు అధికారులు గుర్తించారు.

ఇది కూడా చదవండి..: Drinking Water Wastage | తాగునీటి వృథా.. ఐదుగురికి జరిమానా

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *