అక్షరటుడే, వెబ్డెస్క్: Nizamabad SC ST Case | నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆకుల కొండూర్ గ్రామంలో 2022లో జరిగిన హత్యాయత్నం, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులో ఏడుగురు నిందితులకు సోమవారం కోర్టు జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది.
మేకల లక్ష్మణ్ ఫిర్యాదు మేరకు నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో క్రైం నంబర్ 116/2022గా కేసు నమోదు కాగా, ఈ కేసు స్పెషల్ ఎస్సీ/ఎస్టీ కేసుల కోర్టులో Spl.SC.No.50/2022గా విచారణ జరిగింది. విచారణ అనంతరం గౌరవ ప్రత్యేక న్యాయమూర్తి ఎస్. నారాయణ నిందితులకు శిక్షలు విధిస్తూ తీర్పు ఇచ్చారు.
Nizamabad SC ST Case | నిందితుల్లో మాజీ సర్పంచి..
కేసులో నిందితులైన ఆకుల కొండూర్ గ్రామానికి చెందిన A1 లచ్చోళ్ల నడిపి శైలు, A3 లచ్చోళ్ల నడిపి పెద్ద శైలు, A4 లచ్చోళ్ల గణేష్‌లకు ఐదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.5,000 జరిమానా విధించారు.
Samantha Seemantham | సీమంతంలో శ్రీవిద్యా సొబగులు..కళా ఆవరణలో మాతృత్వానికి దైవత్వపు అభిషేకం!
అలాగే A5 మెట్టు పెద్ద ముత్తెన్న, A6 మెట్టు అశోక్ (మాజీ సర్పంచి), A7 రోడ్డోళ్ల రవిలకు రెండేళ్ల సాధారణ కారాగార శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.1,000 జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. 2022లో నమోదైన ఈ కేసులో కోర్టు విచారణ పూర్తయిన అనంతరం నిందితులకు శిక్షలు ఖరారయ్యాయి.