TG Safe Inspections | డెయిర్​ యూనిట్లలో టీజీ సేఫ్​ అధికారుల తనిఖీలు

హయత్ నగర్‌లోని డెయిరీ యూనిట్లు, పంపిణీ కేంద్రాలలో టీజీ సేఫ్​ అధికారులు తనిఖీలు చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : TG Safe Inspections | హైదరాబాద్‌ (Hyderabad)కు చెందిన ఆహార భద్రతా విభాగం (Food Wing) అధికారులు మంగళవారం ఉదయం హయత్ నగర్‌లోని డెయిరీ యూనిట్లు, పంపిణీ కేంద్రాలలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. పాల నమూనాలను సేకరించారు.

రాష్ట్రంలో కల్తీ ఆహార పదార్థాల దందా జోరుగా సాగుతోంది. ప్రతిదానిని కల్తీ చేసి మార్కెట్​లో విక్రయిస్తున్నారు. దీంతో ప్రజలు అనారోగ్యం భారీన పడుతున్నారు. కల్తీని అరికట్టడానికి ప్రభుత్వం ఫుడ్​ సేఫ్టీ, డ్రగ్​ కంట్రోల్​ అథారిటీ విభాగాలను విలీనం చేసి టీజీ సేఫ్​ అనే కొత్త విభాగాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ వింగ్​ అధికారులు నిత్యం తనిఖీలు చేపడుతూ కల్తీ ఆహార పదార్థాల నియంత్రణకు చర్యలు చేపడుతున్నారు. తాజాగా డెయిర్​ యూనిట్​లలో సోదాలు చేశారు. సరైన లైసెన్స్ లేకుండా కార్యకలాపాలు నిర్వహిస్తూ, అపరిశుభ్రమైన పరిస్థితులను కలిగి ఉన్న ఒక సంస్థను మూసివేయించారు.

TG Safe Inspections | నిత్యం తనిఖీలు

టీజీ సేఫ్​ అధికారులు ఇటీవల దూకుడు పెంచారు. నిత్యం ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు. ఆహార పదార్థాల తయారీ యూనిట్లు, హోటళ్లు, రెస్టారెంట్లలో సోదాలు చేస్తున్నారు. కల్తీ పదార్థాలు తయారు చేస్తున్న, కుళ్లిన మాంసంతో వంటకాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటున్నారు. హోటళ్లు, రెస్టారెంట్లు, తయారీ యూనిట్లలో పరిశుభ్రత పాటించకున్న నోటీసులు ఇస్తున్నారు. ఇటీవల ఎల్​బీ నగర్​ పరిధిలో 20 హోటళ్లు, రెస్టారెంట్లపై తనిఖీలు చేశారు. 9 హోటళ్ల లైసెన్స్​లను రద్దు చేశారు.

ఇది కూడా చదవండి..: Indiramma Towers | ఇందిరమ్మ టవర్స్​ నిర్మాణానికి శంకుస్థాపన

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *