Sensex Nifty Losses | నష్టాల్లో ప్రధాన సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ మంగళవారం నష్టాలతో సాగుతోంది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 203 పాయింట్లు, నిఫ్టీ 55 పాయింట్ల నష్టంతో ఉన్నాయి.

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్: Sensex Nifty Losses | దేశీయ స్టాక్ మార్కెట్ మంగళవారం లాభాలతో ప్రారంభమైంది. అయితే అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు మళ్లీ పెరుగుతుండడం మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. దీనికితోడు ఐటీ షేర్లలో అమ్మకాల ఒత్తిడితో మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి.

Sensex Nifty Losses | లాభాలతో ప్రారంభమైనా..

దేశీయ మార్కెట్లు (Domestic markets) మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం సెన్సెక్స్ 43 పాయింట్ల లాభంతో ప్రారంభమై మరో 137 పాయింట్లు పెరిగింది. ఇంట్రాడే గరిష్టాల వద్ద ప్రాఫిట్ బుకింగ్‌తో 416 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 40 పాయింట్ల లాభంతో ప్రారంభమై మరో 35 పాయింట్లు పైకి ఎగబాకింది. అక్కడినుంచి 142 పాయింట్లు పడిపోయింది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 203 పాయింట్ల నష్టంతో 74,655 వద్ద, నిఫ్టీ 55 పాయింట్ల నష్టంతో 23,359 వద్ద ఉన్నాయి.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో 10 స్టాక్స్ లాభాలతో, 20 స్టాక్స్ నష్టాలతో సాగుతున్నాయి. టైటాన్ 1.34 శాతం, ఎటర్నల్ 1.07 శాతం, ఇండిగో 0.77 శాతం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 0.60 శాతం, ఎన్టీపీసీ 0.35 శాతం లాభాలతో ఉన్నాయి.

Top Losers : హెచ్సీఎల్ టెక్ 1.64 శాతం, ఇన్ఫోసిస్ 1.50 శాతం, టెక్ మహీంద్రా 1.41 శాతం, బజాజ్ ఫిన్‌సర్వ్ 1.21 శాతం, టీసీఎస్ 1.18 శాతం నష్టాలతో ఉన్నాయి.

ఇది కూడా చదవండి..: Sep 22 Gold Prices | అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం, వెండికి ఊతం!

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *