Ganesh Utsav | గణనాథుని సన్నిధిలో ఆధ్యాత్మిక సందడి.. ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

అపార్ట్మెంట్ వాసులు ఉత్సాహంగా పాల్గొని గణనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Ganesh Utsav | విఘ్నాలను తొలగించి శుభాలను ప్రసాదించే వినాయకుడికి నవరాత్రి వేడుకల్లో భాగంగా భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్​లోని బాచుపల్లి, నిజాంపేట్, ప్రగతినగర్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణేష్ మండపాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.

ఆయా మండపాల నిర్వాహకులు, భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులతో గణనాథుడిని కొలిచారు. భక్తుల నామస్మరణలు, మంగళహారతులతో పరిసర ప్రాంతాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. చిన్నారులు, పెద్దలను భాగస్వాములను చేస్తూ వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటల పోటీలు నిర్వహిస్తూ.. విజేతలకు నిర్వాహకులు బహుమతులను అందజేస్తున్నారు.

Ganesh Utsav | అక్షయ క్యాస్టల్‌లో తొలిసారి వేడుకలు

బండారి లేఔట్ రోడ్ నంబరు 4ఏ లోని అక్షయ క్యాస్టల్ అపార్ట్మెంట్‌లో తొలిసారిగా గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అపార్ట్మెంట్ వాసులు ఉత్సాహంగా పాల్గొని గణనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు. చిన్నారులకు, మహిళలకు సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ పోటీలు నిర్వహించి.. బహుమతులు ప్రదానం చేశారు.

Samantha Seemantham | సీమంతంలో శ్రీవిద్యా సొబగులు..కళా ఆవరణలో మాతృత్వానికి దైవత్వపు అభిషేకం!

ఈ సందర్భంగా నిర్వహించిన లడ్డూ వేలం పాట భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. వేలం పాటలో హన్మంత్ రావు రూ.12,500కు లడ్డూను దక్కించుకున్నారు. లడ్డూను ప్రసాదంగా భావించిన భక్తులు వేలం కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

Ganesh Utsav | భక్తి.. సామాజిక ఐక్యతకు వేదికగా ఉత్సవాలు

గణేష్ ఉత్సవాలు కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమాలకే పరిమితం కాకుండా ప్రజల మధ్య సోదరభావం, ఐక్యతను పెంపొందించేలా సాగాయి. చిన్నారుల నుంచి పెద్దల వరకు ఉత్సవాల్లో పాల్గొని భక్తి భావాన్ని చాటుకున్నారు.

ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా స్థానిక పోలీసు అధికారులు, సిబ్బంది ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ భద్రతా చర్యలు చేపట్టారు. ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు కొనసాగడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేశారు.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *