అక్షరటుడే, వెబ్‌డెస్క్: Asian Games Shooting | ఆసియా క్రీడల్లో భాగంగా బుధవారం భారత్ రెండు పతకాలను సాధించింది. షూటింగ్లో ఈ పతకాలు వచ్చాయి. బుధవారం జరిగిన క్రీడల్లో, రైజా ధిల్లాన్, పరినాజ్ ధాలివాల్, మహేశ్వరి చౌహాన్‌లతో కూడిన మహిళల స్కీట్ జట్టు బ్రాంజ్ మెడల్ సాధించింది.
టీమ్ ఈవెంట్‌లో భారత జట్టు 331 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. ఈ ఈవెంట్‌లో చైనా 346 పాయింట్లతో గోల్డ్ మెడల్, కజకిస్థాన్ సిల్వర్ గెలుచుకున్నాయి. మరోవైపు భారత పురుషుల స్కీట్ జట్టు సైతం అద్భుత ప్రతిభ కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది.అనంత్‌జీత్ సింగ్ నరుకా, మైరాజ్ అహ్మద్ ఖాన్, భవతేగ్ సింగ్ గిల్‌లతో కూడిన జట్టు మొత్తం 346 పాయింట్ల స్కోరుతో కజకిస్థాన్‌తో సమంగా నిలిచి మూడవ స్థానంలో నిలిచింది. అనంతరం షూట్ ఆఫ్‌లో విజయం సాధించి కాంస్యం గెలుచుకుంది. దీంతో భారత (India) ఖాతాలో మొత్తం 9 పతకాలు చేరాయి. ఇందులో ఏడు షూటింగ్‌లోనే రావడం గమనార్హం.
Asian Games Shooting | నిరాశ పరిచిన మనూ భాకర్
క్రీడల్లో భాగంగా బుధవారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత ఫైనల్‌లో భారత షూటర్ మను భాకర్ నిరాశపరిచారు. ఒలింపిక్స్ పతక విజేత అయిన ఆమె 181.1 పాయింట్లు సాధించి ఐదో స్థానంలో నిలిచారు. దక్షిణ కొరియాకు చెందిన చూ గేయున్ 246.3 పాయింట్లతో స్వర్ణం, చైనాకు చెందిన షెన్ యియావో 241.3 పాయింట్లతో రజతం గెలుచుకున్నారు. మరోవైపు టీమ్ ఈవెంట్‌లో సైతం భారత మహిళల జట్టు నాలుగో స్థానంలో నిలిచి పతకం కోల్పోయింది.
ఇది కూడా చదవండి..: UNSC India Permanent Membership | భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వానికి భారీ మద్దతు! UN వేదికగా మారుతున్న గ్లోబల్ సమీకరణాలు