అక్షరటుడే, వెబ్‌డెస్క్: Soft Tennis India | ఆసియా క్రీడల్లో భారత ప్లేయర్లు అదరగొడుతున్నారు. బుధవారం షూటింగ్లో రెండు పతకాలు, సాఫ్ట్ టెన్నిస్‌లో ఒక పతకం గెలుచుకున్నారు.
జపాన్‌లో జరుగుతున్న ఆసియా గేమ్స్‌లో బుధవారం జరిగిన సాఫ్ట్ టెన్నిస్ పురుషుల సింగిల్స్‌లో భారత ఆటగాడు జై మీనా కాంస్య పతకంతో తన పోరు ముగించాడు. ఈ క్రీడలో భారత్‌కు మొట్టమొదటి ఆసియా క్రీడల పతకాన్ని సాధించిన వ్యక్తిగా ఆయన నిలిచాడు. సెమీ ఫైనల్లో అతడు జపాన్‌కు చెందిన కురొసాల చేతిలో 2-4 తేడాతో ఓడిపోయాడు.
Soft Tennis India | ఫైనల్లో మీరాబాయి చాను
భారత్ (India) నేడు మరికొన్ని క్రీడాంశాల్లో పాల్గొననుంది. మహిళల కబడ్డీ (భారత్ vs ఇరాన్), మీరాబాయి చాను పాల్గొనే 49 కేజీల వెయిట్‌లిఫ్టింగ్ ఫైనల్, చైనాతో బ్యాడ్మింటన్ సెమీ-ఫైనల్ పోరు ఉన్నాయి. వీటిలో గెలిస్తే భారత్‌కు పతకం ఖాయం కానుంది. ఫైనల్లో మీరాబాయి చాను గెలిస్తే మరో గోల్డ్ మెడల్ ఇండియా ఖాతాలో చేరనుంది. మరోవైపు రోయింగ్‌లో బల్రాజ్ పన్వార్ మూడవ స్థానంలో ఫైనల్‌కు అర్హత సాధించాడు. డబుల్స్‌లో సత్నామ్ సింగ్, సల్మాన్ ఖాన్ ఫైనల్ చేరారు.
ఇది కూడా చదవండి..: Asian Games Shooting | ఆసియా గేమ్స్.. షూటింగ్లో భారత్‌కు మరో రెండు పతకాలు