అక్షరటుడే, వెబ్‌డెస్క్: Crude Oil Prices | పశ్చిమాసియాలో శాంతికోసం దౌత్యపరమైన ప్రయత్నాలు జరుగుతుండడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ మెరుగుపడుతోంది. మరోవైపు సౌదీ అరేబియా ముడి చమురు సరఫరాను పునరుద్ధరించడంతో క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు వంద డాలర్లలోపునకు వచ్చింది. దీంతో గ్లోబల్ మార్కెట్లు పాజిటివ్‌గా ట్రేడ్ అయ్యాయి. ఈ నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ సైతం లాభాల బాటలో పయనించింది.
Crude Oil Prices | లాభాలతో ప్రారంభమై..
దేశీయ మార్కెట్లు (Domestic markets) బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం సెన్సెక్స్ 119 పాయింట్ల లాభంతో ప్రారంభమైనా మొదట్లో 49 పాయింట్లు తగ్గింది. అక్కడినుంచి 374 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 23 పాయింట్ల లాభంతో ప్రారంభమై 3 పాయింట్లు తగ్గింది. కనిష్టాలనుంచి 117 పాయింట్లు పైకి ఎగబాకింది. చివరికి సెన్సెక్స్ 299 పాయింట్ల లాభంతో 74,828 వద్ద, నిఫ్టీ 118 పాయింట్ల లాభంతో 23,446 వద్ద స్థిరపడ్డాయి.
Crude Oil Prices | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 2,809 కంపెనీలు లాభపడగా 1,579 స్టాక్స్ నష్టపోయాయి. 209 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 178 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 84 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 21 స్టాక్ లాభపడగా.. 9 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. టాటా స్టీల్ 3.28 శాతం, బజాజ్ ఫైనాన్స్ 3.07 శాతం, ఐటీసీ 1.77 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 1.73 శాతం, పవర్‌గ్రిడ్ 1.65 శాతం లాభపడ్డాయి.
Top Losers : హెచ్‌సీఎల్ టెక్ 1.10 శాతం, ఇన్ఫోసిస్ 1.03 శాతం, టీసీఎస్ 0.95 శాతం, టైటాన్ 0.60 శాతం, ఎం అండ్ ఎం 0.49 శాతం నష్టపోయాయి.
ఇది కూడా చదవండి..: Hero Motors IPO | హీరో మోటార్స్.. లిస్టింగ్ తర్వాత అదుర్స్..