అక్షరటుడే వెబ్‌డెస్క్: Turtle Wax India | ఆటోమోటివ్ కేర్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన అగ్రగామి సంస్థ ‘టర్టిల్ వాక్స్’ (Turtle Wax) తన 80 వసంతాల చారిత్రక వేడుకలను జరుపుకుంటోంది. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని, సంస్థ గ్లోబల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) లారీ కింగ్ భారత్‌లో పర్యటించారు. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో భారత్ కీలకమైనదని ఆమె ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
Turtle Wax India | నాచురల్ వాక్స్ల నుంచి..
అమెరికాలోని ( US ) చికాగోలో రసాయన శాస్త్రవేత్త బెంజమిన్ హిర్ష్ చేత ప్రారంభించబడిన టర్టిల్ వాక్స్, గత 80 ఏళ్లలో 120కి పైగా దేశాలకు తన కార్యకలాపాలను విస్తరించింది. రక్షణ స్ఫూర్తితో అడుగుపెట్టిన ఈ బ్రాండ్.. నాచురల్ వాక్స్ల నుంచి అధునాతన సిలికాన్ డయాక్సైడ్ సెరామిక్స్, గ్రాఫీన్ నానోటెక్నాలజీ దిశగా అద్భుతమైన ఉత్పత్తులను అందిస్తోంది.
ఈ పర్యటనలో భాగంగా సంస్థ ప్రతిష్టాత్మకమైన Hybrid Solutions® Pure Bead కోటింగ్‌ను భారత్‌లో ఆవిష్కరించింది. ఎలాంటి క్లిష్టమైన పద్ధతులు లేకుండా, గ్లాస్, పీపీఎఫ్ (PPF), మ్యాట్ పెయింట్ వంటి అన్ని ఉపరితలాలపై సులభంగా అప్లై చేసుకునేలా ఈ అధునాతన హైడ్రోఫోబిక్ స్ప్రే టెక్నాలజీని రూపొందించారు. ఇది నీటిని, ధూళిని తక్షణమే వెనక్కి నెట్టి వాహనాలకు ఎక్కువ కాలం కొత్త మెరుపును ఇస్తుంది.
Turtle Wax India | 50కి పైగా కొత్త స్టూడియోలు..
2019లో భారతీయ అనుబంధ సంస్థను ప్రారంభించిన నాటి నుంచి, టర్టిల్ వాక్స్ ఇక్కడ ప్రత్యేకమైన “స్టూడియో-ఫస్ట్” (DIFM) విధానాన్ని విజయవంతంగా అమలు చేస్తోంది. ఢిల్లీ-NCR, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి నగరాల్లో ఇప్పటికే 100కి పైగా కో-బ్రాండెడ్ కార్ కేర్ స్టూడియోలను ఏర్పాటు చేసిన సంస్థ.. రాబోయే 1 నుంచి 2 ఏళ్లలో మరో 50కి పైగా కొత్త స్టూడియోలను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
స్థానిక వాతావరణ పరిస్థితులకు అనుగుణమైన ఉత్పత్తులను అందించడం, తయారీ భాగస్వామ్యాలను విస్తరించడం ద్వారా భారతీయ ఆటోమోటివ్ సమాజానికి పూర్తి మద్దతుగా నిలుస్తామని CEO లారీ కింగ్ , ఆసియాన్ మార్కెటింగ్ డైరెక్టర్ దిబ్య స్వరూప్ పానిగ్రాహి తెలిపారు.
ఇది కూడా చదవండి: Bhadradri Temple | ఓట్ల కోసం దేవుడిని మోసం చేసిన బీఆర్ఎస్ : పొంగులేటి