అక్షరటుడే వెబ్‌డెస్క్: Star Health Rajahmundry | రాజమండ్రిలో ఆరోగ్య రక్షణ సేవలను మరింత మెరుగుపరచడంతో పాటు, ఆసుపత్రులతో భాగస్వామ్యాన్ని మరింత బలపేతం చేసేందుకు ‘స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్’ సంస్థ ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ హెల్త్‌కేర్ పార్ట్నర్ సమావేశానికి రాజమండ్రి పరిసర ప్రాంతాల నుంచి సుమారు 75 హెల్త్‌కేర్ ప్రొవైడర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న 100 మందికి పైగా ఆసుపత్రి అధిపతులు, మేనేజింగ్ డైరెక్టర్లు, సీఈఓలు హాజరయ్యారు.
ఈ భేటీకి రాజమండ్రితో పాటు కాకినాడ, తణుకు, అమలాపురం, అనపర్తి, కొత్తపేట, మండపేట, తాడేపల్లిగూడెం, రావులపాలెం తదితర ప్రాంతాల నుంచి ప్రముఖ ఆసుపత్రుల ప్రతినిధులు తరలివచ్చారు. ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ కురుకూరి విజయ్ కుమార్, స్టార్ హెల్త్ సీనియర్ ప్రాంతీయ నాయకులు ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు.
Star Health Rajahmundry | క్లెయిమ్‌ల వివరాలు..
ప్రస్తుతం రాజమండ్రి , దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో స్టార్ హెల్త్ సంస్థ 110కి పైగా నెట్వర్క్ ఆసుపత్రులను కలిగి ఉంది. దీని ద్వారా ఈ ప్రాంతంలోని వినియోగదారులకు క్యాష్‌లెస్ వైద్య సేవలు మరింత సులభంగా అందుతున్నాయి. ఇక ఆర్థిక సంవత్సరం 2026 (FY26) లో ఈ మార్కెట్లలో రూ. 21.01 కోట్ల విలువైన 2,822 క్లెయిమ్‌లను కంపెనీ విజయవంతంగా పరిష్కరించింది. ముఖ్యంగా ఇందులో 75 శాతం క్లెయిమ్‌లు పూర్తిగా క్యాష్‌లెస్ నెట్వర్క్ ద్వారానే అందించడం విశేషం. ప్రస్తుతం ఈ ప్రాంతంలో 48,921 మందికి పైగా వినియోగదారులకు స్టార్ హెల్త్ సేవనందిస్తోంది.
ఈ కార్యక్రమంలో స్టార్ హెల్త్ తరఫున ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ( Telangana ), ఛత్తీస్‌గఢ్ బిజినెస్ హెడ్ శ్రీనివాస్ కేబీబీ, హెచ్ఆర్ఎం హెడ్ డాక్టర్ ఉష, రీజినల్ క్లెయిమ్స్ హెడ్ డాక్టర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Star Health Rajahmundry | ఆసుపత్రుల పాత్రే కీలకం..
“పెద్ద నగరాలతో పాటు ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ హెల్త్ ఇన్సూరెన్స్ వాడకం వేగంగా పెరుగుతోంది. ఈ తరుణంలో మరింత బలమైన, వేగవంతమైన ఆరోగ్య రక్షణ వ్యవస్థను నిర్మించడం చాలా ముఖ్యం. అత్యవసర సమయాల్లో కస్టమర్లకు ఇబ్బంది లేకుండా నాణ్యమైన సేవలు అందడంలో ఆసుపత్రుల పాత్రే కీలకం. రాజమండ్రి వంటి మార్కెట్లలో మా ఉనికిని మరింత విస్తరించడం, క్యాష్‌లెస్ సేవలను సులభతరం చేయడం, ఆసుపత్రిలో చేరే ప్రక్రియను , క్లెయిమ్‌ల పరిష్కారాన్ని మరింత వేగవంతం చేయడానికి ఆసుపత్రి భాగస్వాములతో కలిసి పనిచేయడమే మా ప్రధాన లక్ష్యం” అని వెల్లడించారు.
ఇది కూడా చదవండి: DSP Bheem Reddy | డీఎస్పీ భీమ్‌రెడ్డి బినామీ ఇంట్లో నోట్ల కట్టలు