బిజినెస్​IHCL | హైదరాబాద్‌కు ‘జింజర్’ ఘుమఘుమలు.. ఎయిర్‌పోర్ట్ రోడ్‌లో గ్రాండ్ లాంచ్!

IHCL | హైదరాబాద్‌కు ‘జింజర్’ ఘుమఘుమలు.. ఎయిర్‌పోర్ట్ రోడ్‌లో గ్రాండ్ లాంచ్!

భారతదేశపు దిగ్గజ హాస్పిటాలిటీ సంస్థ 'ఇండియన్ హోటల్స్ కంపెనీ', తన ప్రముఖ బ్రాండ్ ‘జింజర్’ను హైదరాబాద్ మార్కెట్లోకి అధికారికంగా ప్రవేశపెట్టింది.

అక్షరటుడే, వెబ్​డెస్క్​: IHCL | భారతదేశపు దిగ్గజ హాస్పిటాలిటీ సంస్థ ‘ఇండియన్ హోటల్స్ కంపెనీ’ (IHCL), తన ప్రముఖ బ్రాండ్ ‘జింజర్’ (Ginger) ను హైదరాబాద్ మార్కెట్లోకి అధికారికంగా ప్రవేశపెట్టింది. నగరంలోని ఎయిర్‌పోర్ట్ రోడ్‌లో వ్యూహాత్మకంగా నిర్మించిన ఈ సరికొత్త హోటల్‌ను బుధవారం ప్రారంభించారు.

IHCL | అత్యాధునిక వసతులు

ఈ హోటల్‌లో మొత్తం 118 గదులు ఉన్నాయి. గదుల నుండి చుట్టూ ఉన్న విశాలమైన పచ్చిక బయళ్లను చూస్తూ అతిథులు ఆహ్లాదాన్ని పొందవచ్చు. జింజర్ బ్రాండ్ సిగ్నేచర్ రెస్టారెంట్ ‘క్యూమిన్’ (Qumin)లో అన్ని రకాల రుచులు అందుబాటులో ఉంటాయి. వీటితో పాటు అత్యాధునిక ఫిట్‌నెస్ సెంటర్ కూడా ఉంది. కార్పొరేట్ సమావేశాలు, సదస్సులు , సామాజిక వేడుకల కోసం విశాలమైన బాంకెట్ సౌకర్యాలను ఇక్కడ కల్పించారు.

హైదరాబాద్‌లోకి జింజర్ బ్రాండ్‌

ఈ సందర్భంగా ఐహెచ్‌సీఎల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ దీపికా రావు మాట్లాడుతూ.. “దేశంలోనే కీలకమైన లాడ్జింగ్ మార్కెట్ కలిగిన హైదరాబాద్‌లోకి జింజర్ బ్రాండ్‌ను తీసుకురావడం ఆనందంగా ఉంది. టెక్నాలజీ, ఫార్మా, ఎడ్యుకేషన్ రంగాల కేంద్రంగా ఉన్న ఈ నగరంలో విభిన్న తరహా వినియోగదారుల అవసరాలను ఈ హోటల్ తీరుస్తుంది” అని పేర్కొన్నారు.

ప్రతిష్టాత్మక సంస్థతో భాగస్వామ్యం

నిమంత్రన్ క్యాటరింగ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ప్రతాప్ జడేజా మాట్లాడుతూ.. ఐహెచ్‌సీఎల్ వంటి ప్రతిష్టాత్మక సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం , నగరంలోని వ్యాపార వర్గాలకు సమకాలీన ఆతిథ్యాన్ని అందించడం సంతోషంగా ఉందని తెలిపారు. ఐటీ, ఫార్మా రంగాలకు ప్రపంచ స్థాయి కేంద్రంగా ఉన్న హైదరాబాద్‌లో, దేశీయ , అంతర్జాతీయ ప్రయాణికులకు ఈ కొత్త హోటల్ ఒక సరైన గమ్యస్థానంగా మారనుంది.

ఇది కూడా చదవండి..: Hyundai Ioniq 5 Facelift | హ్యుందాయ్ కొత్త అయానిక్ 5 ఫేస్‌లిఫ్ట్.. సింగిల్ చార్జింగ్ తో 690 కి.మీ. ప్రయాణం

Shivam nagarani
Shivam nagaranihttps://aksharatodaynews.com/
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Pallikonda Theft Case | పల్లికొండలో దొంగల హల్​చల్​.. ఐదు తులాల బంగారం దోపిడీ..

అక్షరటుడే, భీమ్​గల్: Pallikonda Theft Case | దొంగలు హల్​చల్​ చేశారు....

Modi UAE Visit | ప్రధాని మోడీ విదేశీ పర్యటన.. యూఏఈలో కీలక భేటీ!

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Modi UAE Visit | ఐరోపా దేశాల్లో వచ్చే నెల...

IFS Officers Transfers | ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) అధికారుల బదిలీ

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: IFS Officers Transfers | ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS)...