అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Power Supply | పట్టణంలో (Kamareddy) కరెంట్ సమస్యలు సామాన్య ప్రజలను సైతం ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. తరచుగా వస్తూ పోతూ ఉండటంతో ఇళ్లలో ప్రమాదాలు జరుగుతున్నాయి.
Kamareddy Power Supply | కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో..
కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లి గ్రామంలోని పోచమ్మ ఆలయం వద్ద గల ఓ ఇంట్లో శుక్రవారం సాయంత్రం విద్యుత్ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ కాలిపోయింది. పక్కనే ఉన్న డోర్ కర్టెన్స్, చిన్న చిన్న సామగ్రి కాలిపోయాయి. ప్రమాదం సమయంలో ఇంట్లో ఓ మహిళ మాత్రమే ఉంది. ఫ్రిడ్జ్ శబ్దం రావడంతో అప్రమత్తమైన మహిళ వెంటనే ఫ్రిడ్జ్ బటన్ ఆఫ్ చేసి కాలనీ వాసులను పిలవడంతో కరెంట్ సరఫరా నిలిపివేశారు. దాంతో పెను ప్రమాదం తప్పింది. షార్ట్ సర్క్యూట్ తో మంటలు వ్యాప్తి చెంది ఉంటే ఊహించని ప్రమాదం సంభవించేదని స్థానికులు తెలిపారు.
ఇది కూడా చదవండి: బాక్సాఫీస్పై నాని దండయాత్ర..‘ప్యారడైజ్’కు ఫస్ట్ డే రికార్డ్ కలెక్షన్స్..