Vijay Deverakonda Ranabali | దసరా బరిలో రౌడీ హీరో: ‘రణబాలి’ రిలీజ్ డేట్‌పై మైత్రి మూవీ మేకర్స్ క్లారిటీ!

ఇటీవల విడుదలైన టీజర్, అజయ్-అతుల్ స్వరపరిచిన 'ఏందయ్యా సామీ' పాట ఆడియన్స్ నుంచి విశేష స్పందనను రాబట్టుకుని సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Vijay Deverakonda Ranabali | టాలీవుడ్ మోస్ట్ క్రేజీ పెయిర్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగాటి నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’. ‘టాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అభిమానుల్లో, సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే షూటింగ్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదల తేదీపై మైత్రి మూవీ మేకర్స్ సంస్థ తాజాగా అధికారిక ప్రకటన విడుదల చేసింది.

Hyderabad Man Murdered | గంజాయి సమాచారం లీక్ చేస్తున్నాడనే అనుమానం.. సహచరుడిని దారుణంగా పొడిచేసిన ముఠా

Vijay Deverakonda Ranabali | అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి

ఈ సినిమాను విజయాదశమి కానుకగా అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకువస్తున్నట్లు నిర్మాణ సంస్థ స్పష్టం చేసింది. ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రత్యేక పోస్టర్‌లో విజయ్ దేవరకొండ నుదుటి పైన తిలకంతో డిఫరెంట్ అండ్ పవర్‌ఫుల్ లుక్‌లో కనిపిస్తూ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నారు.

1854 నుంచి 1878 మధ్యకాలంలో బ్రిటిష్ పాలనా సమయంలో జరిగిన వాస్తవ చారిత్రక ఘట్టాల ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇటీవల విడుదలైన టీజర్, అజయ్-అతుల్ స్వరపరిచిన ‘ఏందయ్యా సామీ’ పాట ఆడియన్స్ నుంచి విశేష స్పందనను రాబట్టుకుని సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. దసరా రేసులో విజయ్ దేవరకొండ సరికొత్త రికార్డులు సృష్టిస్తాడని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *