అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Nagaram Bhavani Mata Temple | నగర శివారులోని (Nizamabad) నాగారం ఆర్టీఏ కార్యాలయం సమీపంలో భవానీమాత ఆలయంలో పౌర్ణమి సందర్భంగా శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నదానం చేశారు.
Nagaram Bhavani Mata Temple | 1981లో విగ్రహ ప్రతిష్టాపన..
ఈ సందర్భంగా ఆలయ పూజారి శేఖర్ మాట్లాడుతూ.. 1981లో ఆలయంలో భవానీమాత విగ్రహ ప్రతిష్టాపన జరిగిందన్నారు. అప్పటి నుంచి ప్రతి పౌర్ణమి రోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామన్నారు. ముందుగా ఆలయ ప్రాంగణంలో యజ్ఞం చేశారు. అలాగే దాతల సహకారంతో అన్నదానం జరుగుతుందన్నారు. ప్రతి పౌర్ణమి రోజు సుమారు 200మందికి పైగా భక్తులు ఆలయాన్ని దర్శించుకుంటున్నారన్నారు. దాతలు సహకరించి మరింత అభివృద్ధి చేసుకునేందుకు ముందుకు రావాలన్నారు.
ఇది కూడా చదవండి: ఆడియన్స్ ప్రేమ దక్కింది ప్యారడైజ్ మూవీలోనే.. – నటి క్రాంతి