బిజినెస్​April 30 Gold Rates | మ‌రింత త‌గ్గుతున్న బంగారం ధ‌ర‌.. కొనుగోలుదారులకు ఊరట!

April 30 Gold Rates | మ‌రింత త‌గ్గుతున్న బంగారం ధ‌ర‌.. కొనుగోలుదారులకు ఊరట!

అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్ తగ్గడం, డాలర్ బలపడటం వంటి పరిణామాల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. వరుసగా పెరిగిన ధరల తర్వాత వచ్చిన ఈ తగ్గుదలతో కొనుగోలుదారులు ఊరట పొందుతున్నారు.

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: April 30 Gold Rates | అంతర్జాతీయ మార్కెట్‌లో మారుతున్న పరిస్థితుల ప్రభావంతో దేశీయంగా బంగారం ధరలు Gold Rates తగ్గుముఖం పట్టాయి.

ముఖ్యంగా డిమాండ్ తగ్గడం, అమెరికన్ డాలర్ బలపడడం వంటి అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు తాజాగా తగ్గుతుండటంతో మార్కెట్‌లో ఆసక్తికర చర్చ కొనసాగుతోంది.

గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ వివరాల ప్రకారం.. గురువారం ఉదయం 6 గంటల సమయానికి హైదరాబాద్, విజయవాడ నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,50,430గా నమోదైంది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ఆభరణాల బంగారం ధర రూ.1,37,890గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఇదే ధోరణి కొనసాగుతోంది. అక్కడ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,50,580గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,38,040గా నమోదైంది.

April 30 Gold Rates | క్ర‌మేపీ త‌గ్గుద‌ల‌..

ఇక వెండి ధరలు Silver Prices కూడా తగ్గుముఖం పట్టాయి. కిలో వెండిపై సుమారు రూ.100 వరకు తగ్గుదల నమోదైంది. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి ధర రూ.2,64,900గా ఉంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.2,54,900గా ఉండగా, చెన్నైలో రూ.2,64,900, బెంగళూరులో రూ.2,54,900గా నమోదయ్యాయి.

April 30 Gold Rates | పెళ్లిళ్ల సీజన్​..

బంగారం, వెండి ధరల తగ్గుదలతో పెళ్లిళ్లు, వేడుకల కోసం కొనుగోలు చేయాలనుకునే వారికి కొంత ఊరట లభిస్తోంది. అయితే అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధరలు మరింతగా ఎలా మారతాయన్న దానిపై అనిశ్చితి నెలకొంది. పెట్టుబడిదారులు, కొనుగోలుదారులు మార్కెట్ ధోరణులను గమనిస్తూ నిర్ణయాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఈ మధ్య కాలంలో బంగారం ధరల్లో చాలా మార్పులు వస్తుండ‌డం మ‌నం గ‌మ‌నిస్తూ ఉన్నాం. ఈ నేప‌థ్యంలో రోజు రోజుకు బంగారం ధరలు ఎలా ఉన్నాయి? తగ్గుతున్నాయా? పెరుగుతున్నాయా.. అని తెలుసుకోవడంపై ఎక్కువ ఆస‌క్తి చూపిస్తున్నారు.. ఇక పెళ్లీ Marriage సీజన్ కూడా కావడంతో బంగారం ధర కాస్త తగ్గినా సరే, వెంటనే వెళ్లి కొనుగోలు చేయడానికి రెడీ అవుతున్నారు.

Harish Rao TRS row | TRS పేరుతో హరీష్ రావు సొంత పార్టీ!..ఇది కొత్త వ్యూహమా..?

Naresh Chandan
Naresh Chandanhttps://aksharatodaynews.com/
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

 Rajnath Singh | ఉగ్రవాదంపై రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు

అక్షరటుడే, వెబ్​డెస్క్: Rajnath Singh | రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్​...

Traffic Constable Help | రక్తదానం చేసి చిన్నారి ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్​ కానిస్టేబుల్​

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Traffic Constable Help | ట్రాఫిక్​ కానిస్టేబుల్​...

Madhya Pradesh Accident | మధ్యప్రదేశ్​లో ఘోర ప్రమాదం.. 16 మంది మృతి

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Madhya Pradesh Accident | మధ్యప్రదేశ్ (Madhya...

SR SSC Results ​| ఎస్సెస్సీ ఫలితాల్లో ఎస్ఆర్ విద్యార్థుల ప్రభంజనం

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: ​SR SSC Results ​| ఎస్సెస్సీ ఫలితాల్లో...