Bat Entering House | ఇంట్లోకి గబ్బిలం వస్తే అశుభమా?.. అసలు నిజం ఏంటంటే

గబ్బిలాలు సాధారణంగా రాత్రి సమయంలోనే సంచరిస్తుంటాయి.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Bat Entering House | గబ్బిలాలు సాధారణంగా రాత్రి సమయంలోనే సంచరిస్తుంటాయి. చెట్లు ఎక్కువగా ఉండే ప్రాంతాలు లేదా పాత ఇళ్లలో ఇవి ఎక్కువగా కనిపిస్తుంటాయి. అయితే, ఎవరి ఇళ్లలోనైనా గబ్బిలం ప్రవేశిస్తే చాలామంది వెంటనే కంగారుపడిపోతుంటారు. ఇది ఏదో చెడు జరుగుతుందనడానికి సంకేతమని, అశుభమని భయపడుతుంటారు. మరి నిజంగా ఇంటిలోకి గబ్బిలం రావడం మంచిదా కాదా అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Bat Entering House | పాత సమస్యలకు పరిష్కారం..

కొన్ని నమ్మకాల ప్రకారం, గబ్బిలం ఇంటిలోకి వచ్చి వెంటనే బయటకు వెళ్లిపోతే భయపడాల్సిన అవసరం లేదని పండితులు చెబుతున్నారు. ఇది ఇంట్లోని పాత సమస్యలు తొలగిపోవడానికి లేదా జీవితంలో కొత్త మార్పులు ప్రారంభం కావడానికి సంకేతంగా భావించవచ్చు.

Bat Entering House | నెగటివ్ ఎనర్జీకి సూచన?

మరికొన్ని వాదనల ప్రకారం.. గబ్బిలం ఇంట్లోకి ప్రవేశించి ఎక్కువసేపు తిరిగితే అది ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తుందని చెబుతుంటారు. ఇంట్లో ప్రతికూల శక్తి ( Negative Energy ) ఎక్కువగా ఉండటం, చీకటిగా ఉండే వాతావరణం వల్ల కూడా గబ్బిలాలు లోపలికి వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో అప్పుల బాధలు, ధన నష్టం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని కొందరు నమ్ముతారు.

Bat Entering House | వాస్తు శాస్త్రం ప్రకారం..

వాస్తు శాస్త్రం ప్రకారం, గబ్బిలం ఇంటిలోకి వచ్చి వెంటనే వెళ్లిపోవడం కొన్నిసార్లు శుభశకునంగా కూడా పరిగణించవచ్చు. ఇది ఇంట్లోని చెడును, నెగటివిటీని బయటకు తీసుకువెళ్తుందని భావిస్తారు కాబట్టి దీని గురించి ఎక్కువగా ఆందోళన చెందాల్సిన పనిలేదని నిపుణులు సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి:  Khairatabad Bypoll | ఖైరతాబాద్ ఉపఎన్నిక.. కిషన్ రెడ్డికి మరో అగ్నిపరీక్ష..!

 

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *