CARE Degree College | కేర్ డిగ్రీ కళాశాలలో ఉత్సాహంగా ఫ్రెషర్స్​ పార్టీ

నగరంలోని కేర్​ డిగ్రీ కళాశాలలో ఫ్రెషర్స్​ పార్టీ ఘనంగా నిర్వహించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: CARE Degree College | నగరంలోని (Nizamabad) కేర్​ డిగ్రీ కళాశాలలో కొత్త విద్యార్థులను ఆహ్వానిస్తూ ఫ్రెషర్స్​డే సెలబ్రేషన్స్​ను ఘనంగా నిర్వహించారు. నగరంలోని న్యూ అంబేడ్కర్​ భవన్​లో ఈ కార్యక్రమం జరిగింది.

CARE Degree College | ఆడిపాడిన విద్యార్థులు..

ఫస్టియర్​ విద్యార్థులను ఆహ్వానిస్తూ సెకండియర్​, థర్డ్​ ఇయర్​ విద్యార్థులు ఫ్రెషర్స్ పార్టీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్యాలు ఆహుతులను అలరించారు. అనంతరం కళాశాల డైరెక్టర్ నరాల సుధాకర్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టాలని.. తద్వారా దేశానికి పేరు తెచ్చేవిధంగా తయారు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో కేర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ గోరంట్యాల నరేష్, వైస్ ప్రిన్సిపల్ రాజేంద్రప్రసాద్, కళాశాల బాధ్యులు కొయ్యాడ శంకర్, సందేశ్, కిరణ్, శ్రీనివాస్, రాజు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: టీచర్ల కోసం రోడ్డెక్కిన చిన్నారులు.. 

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *