Sep 29 Market Analysis | బలహీనంగా గ్లోబల్ మార్కెట్లు..ఫ్లాట్ టు నెగెటివ్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ

గ్లోబల్ మార్కెట్లు బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి. మన మార్కెట్లు ఫ్లాట్ టు నెగెటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Sep 29 Market Analysis | అమెరికా, ఇరాన్‌ల మధ్య శాంతి ఒప్పందం అవకాశాలపై అనిశ్చితి నెలకొనడం మార్కెట్ సెంటిమెంట్‌పై ప్రభావం చూపుతోంది. ముడి చమురు ధరలు అధిక స్థాయిలలోనే ఉంటుండడం ఇన్వెస్టర్లలో ఆందోళన పెంచుతోంది. దీంతో స్టాక్ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి నెలకొంది.

Sep 29 Market Analysis | యూఎస్ మార్కెట్లు..

పెరుగుతున్న బాండ్ల రాబడులు, అధిక చమురు ధరలు, బలపడిన అమెరికా డాలర్ వంటి అంశాలు ఈక్విటీ మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి. దీంతో గత సెషన్‌లో నాస్‌డాక్ 0.92 శాతం, ఎస్ అండ్ పీ 0.77 శాతం నష్టంతో ముగిశాయి. మంగళవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.11 శాతం నష్టంతో ఉంది.

Sep 29 Market Analysis | యూరోప్ మార్కెట్లు..

ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 0.01 శాతం లాభంతో, జర్మనీకి చెందిన డీఏఎక్స్ 0.13 శాతం, యూకేకు చెందిన ఎఫ్టీఎస్ ఈ 0.10 శాతం నష్టంతో ముగిశాయి.

Sep 29 Market Analysis | ఆసియా మార్కెట్లు..

ప్రధాన ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. ఉదయం 8 గంటల ప్రాంతంలో జపాన్‌కు చెందిన నిక్కీ 0.91 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 0.80 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 0.41 శాతం, సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 0.25 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.12 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.10 శాతం నష్టంతో కదలాడుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 0.07 శాతం నష్టంతో ఉండడంతో మన మార్కెట్లు ఫ్లాట్ టు నెగెటివ్ గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

IIT Placement Ban | ఐఐటీల సంచలన నిర్ణయం.. 22 దిగ్గజ కంపెనీలపై నిషేధం.. 150 మందికి పైగా విద్యార్థుల ఉద్యోగాలు రద్దు!

గమనించాల్సిన అంశాలు..

  • విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు గత సెషన్‌లో నికరంగా రూ. 5,353 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
  • డీఐఐలు వరుసగా 34 వ సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. గత సెషన్‌లో నికరంగా రూ. 5,189 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు.
  • డాలర్‌తో రూపాయి మారకం విలువ 15 పైసలు బలహీనపడి 95.98 వద్ద ఉంది.
  • యూఎస్ డాలర్ ఇండెక్స్ 101.21 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 5.24 శాతం వద్ద ఉన్నాయి.
  • క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 106.60 డాలర్ల వద్ద ఉంది.
  • నిఫ్టీ పుట్‌కాల్ రేషియో 0.97 నుంచి 0.71 కి పెరిగింది.
  • విక్స్ 12.15 నుంచి 13.63 కు పెరిగింది.
  • నిఫ్టీ డెరివేటివ్స్ వీక్లీ, మంత్లీ ఎక్స్‌పైరీ నేపథ్యంలో మార్కెట్‌లో ఒడుదుడుకులు ఉండే అవకాశాలున్నాయి.
Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *