జాతీయంMadhya Pradesh Accident | మధ్యప్రదేశ్​లో ఘోర ప్రమాదం.. 16 మంది మృతి

Madhya Pradesh Accident | మధ్యప్రదేశ్​లో ఘోర ప్రమాదం.. 16 మంది మృతి

మధ్యప్రదేశ్​లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 16 మంది చనిపోయారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Madhya Pradesh Accident | మధ్యప్రదేశ్ (Madhya Pradesh)​లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ పికప్​ వ్యాన్​ బోల్తా పడింది. అనంతరం అది ఓ కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో 16 మంది చనిపోయారు.

మధ్యప్రదేశ్‌లోని ధార్‌ జిల్లా (Dhar District)లో బుధవారం రాత్రి ప్రమాదం చోటు చేసుకుంది. ఇండోర్-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై చికిలియాలోని రిలయన్స్ పెట్రోల్ పంపు సమీపంలో ప్రమాదం జరిగింది. కూలీలతో కిక్కిరిసి ఉన్న పికప్ ట్రక్కు అకస్మాత్తుగా అదుపుతప్పి బోల్తా పడింది. ట్రక్కు సామర్థ్యానికి మించి ప్రయాణికులను తీసుకువెళుతున్నట్లు అధికారులు తెలిపారు. వాహనం బోల్తా పడిన తర్వాత దానిని ఎస్​యూవీ వాహనం ఢీకొంది.

Madhya Pradesh Accident | 50 మంది కూలీలతో..

పికప్​ ట్రక్​ 50 మంది కూలీలతో వెళ్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అధికారులు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఘటన స్థలంలో మొదట ఐదుగురు మృతి చెందారు. ఆ ప్రాంతం మృతదేహాలు, నెత్తుటి మరకలతో భయానకంగా మారింది. గురువారం ఉదయం వరకు మృతుల సంఖ్య 16కు పెరిగింది. మరో 15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం ఇండోర్‌కు తరలించారు.

Madhya Pradesh Accident | తిరిగి వెళ్తుండగా..

కేంద్ర సహాయ మంత్రి సావిత్రి ఠాకూర్, ఇండోర్ డివిజనల్ కమిషనర్ సుదామా ఖడే, ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఇండోర్ రేంజ్) అనురాగ్‌తో కలిసి ఘటన స్థలాన్ని పరిశీలించారు. బగ్గడ్ గ్రామం సమీపంలోని పొలాల్లో పనిచేసి పికప్ ట్రక్కులో తిరిగి వస్తున్న కూలీల విషయంలో ఈ ప్రమాదం జరిగిందన్నారు. వాహనంలోని స్పీకర్ల నుండి పెద్దగా సంగీతం పెడుతూ, డ్రైవర్ వాహనాన్ని అటూ ఇటూ తిప్పుతూ అస్తవ్యస్తంగా నడుపుతున్నాడని కూలీలు వివరించారు. కేంద్ర ప్రభుత్వం (Central Government) ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలను కేంద్రం రూ.2లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేల చొప్పున పరిహారం ప్రకటించింది.

ఇది కూడా చదవండి..: DJ Sound | డీజే శబ్దం భరించలేక 140 కోళ్లు మృతి.. ఉత్తరప్రదేశ్‌లో విచిత్ర ఘటన

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Hanumantha Rao Appointment | ప్రభుత్వ సలహాదారుగా వీహెచ్‌ నియామకం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hanumantha Rao Appointment | తెలంగాణ ప్రభుత్వ...

Trump Putin Talks | ఇరాన్‌కు రష్యా అండ.. యుద్ధం ముగింపుపై ట్రంప్ క్లారిటీ!

అక్షరటుడే, వెబ్​డెస్క్: Trump Putin Talks | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్...

Shivadhar Reddy Farewell | డీజీపీ శివధర్​రెడ్డికి ఘనంగా వీడ్కోలు

అక్షరటుడే, వెబ్​డెస్క్: Shivadhar Reddy Farewell | తెలంగాణ డీజీపీ శివధర్​రెడ్డి...

AP 10th Results | ఏపీలో పదో తరగతి ఫలితాలు విడుదల

అక్షరటుడే, వెబ్​డెస్క్: AP 10th Results | ఆంధ్ర ప్రదేశ్​లో పదో...