అక్షరటుడే, కామారెడ్డి: Kisan Mela 2026 | రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధికే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. పట్టణంలోని కళాభారతి ఆడిటోరియంలో బుధవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో, ఆత్మ సౌజన్యంతో నిర్వహించిన జిల్లాస్థాయి కిసాన్ మేళా-2026లో ఆయన పాల్గొన్నారు.
Kisan Mela 2026 | నూతన సాగు విధానాలపై అవగాహన..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, నూతన సాగు విధానాలపై అవగాహన కల్పించేందుకు కిసాన్ మేళాలు ఎంతో ఉపయోగపడతాయని షబ్బీర్ అలీ (Shabbir Ali) అన్నారు. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించే సాంకేతికతను రైతులు అందిపుచ్చుకోవాలని, ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైతు బాగుంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందన్నారు. అనంతరం రైతులు ఏర్పాటు చేసిన పలు స్టాల్స్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, మున్సిపల్ ఛైర్పర్సన్ ఉమారాణి, గ్రంథాలయ ఛైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఐరేని సందీప్, మార్కెట్ కమిటీ ఛైర్మన్ లక్ష్మి రాజాగౌడ్, అదనపు కలెక్టర్ విక్టర్, వ్యవసాయ అధికారి మోహన్ రెడ్డి, ట్రైనీ ఐఏఎస్ రవితేజ, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Kamareddy Government College | విద్యార్థుల భవిష్యత్తుకు ప్రభుత్వ ప్రాధాన్యత