ఆంధ్రప్రదేశ్​AP 10th Results | ఏపీలో పదో తరగతి ఫలితాలు విడుదల

AP 10th Results | ఏపీలో పదో తరగతి ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్​లో పదో తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. మంత్రి నారా లోకేశ్​ ఉదయం రిజల్ట్స్​ ప్రకటించారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్: AP 10th Results | ఆంధ్ర ప్రదేశ్​లో పదో తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. మంత్రి నారా లోకేశ్​ (Minister Nara Lokesh)  ఉదయం 11 గంటలకు రిజల్ట్స్​ ప్రకటించారు. విద్యార్థులు అధికారిక వెబ్​సైట్​తో పాటు వాట్సాప్​ ద్వారా కూడా ఫలితాలు చెక్​ చేసుకోవచ్చు. తమ హాల్​ టికెట్ నంబర్​ ఎంటర్​ చేసి మార్కులు చూసుకోవచ్చు.

AP 10th Results | 85 శాతం ఉత్తీర్ణత

రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్థులు పదో తరగతి ఫలితాల కోసం నిరీక్షిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం ఉదయం విద్యాశాఖ మంత్రి లోకేశ్ ఫలితాలు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 85శాతం ఉత్తీర్ణత నమోదు అయింది. మొత్తం 6,40,916 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. బాలురు 3,28,652 మంది, బాలికలు 3,12,264 మంది ఉన్నారు. 3,415 పరీక్ష కేంద్రాల్లో మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు పరీక్షలు జరిగాయి.

AP 10th Results | మే 25 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు

పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం అడ్వాన్స్‌డ్స్‌ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. మే 25 నుంచి జూన్‌ 4 వరకు సప్లిమెంటరీ పరీక్షలు (Supplementary Examinations) నిర్వహించనున్నారు. మే 1 నుంచి 9 వరకు పరీక్ష ఫీజు చెల్లించే అవకాశం ఉంది. రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌ కోసం మే 1 నుంచి 7 వరకు అప్లై చేసుకోవచ్చు.

ఇది కూడా చదవండి..: Amaravati Development | అమరావతి అభివృద్ధికి కీలక నిర్ణయాలు.. ఈరోజు మంత్రివర్గ సమావేశంలో భారీ ప్రాజెక్టులకు ఆమోదం?

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Nepal Airlines Map | తప్పుడు మ్యాప్‌ వివాదం.. తలవంచిన నేపాల్ ఎయిర్‌లైన్స్!

అక్షరటుడే, న్యూదిల్లీ: Nepal Airlines Map | భారత భూభాగమైన జమ్మూకశ్మీర్‌ను...

MMTS Free Travel | హైదరాబాదీల‌కు గుడ్ న్యూస్.. ఎంవోయూ రెడీ, ఎంఎంటీఎస్ ఉచిత ప్రయాణం ఎప్పటి నుండో తెలుసా?

అక్షరటుడే, వెబ్​డెస్క్: MMTS Free Travel | హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్...

Gandhi Bhavan | గాంధీ భవన్ ఎదుట ఉద్యమకారుల ఆందోళన

అక్షరటుడే, వెబ్​డెస్క్: Gandhi Bhavan | హైదరాబాద్ (Hyderabad)​లోని గాంధీ భవన్​...

Kavitha TRS Party | కవిత టీఆర్​ఎస్​కు ఎన్నికల సంఘం ఆమోదం.. పార్టీ పేరులో చిన్న మార్పు

అక్షరటుడే, వెబ్​డెస్క్: Kavitha TRS Party | కల్వకుంట్ల కవిత (Kalvakuntla...