Oct 10 Market Analysis | లాభాల్లో ఆసియా మార్కెట్లు..నెగెటివ్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ

ఆసియా మార్కెట్లు లాభాల బాటలో ఉన్నాయి. మన మార్కెట్లు మాత్రం నెగెటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయన్న సంకేతాన్ని గిఫ్ట్ నిఫ్టీ ఇస్తోంది.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Oct 10 Market Analysis | అమెరికాలో ద్రవ్యోల్బణం(Inflation) అంచనాలకన్నా తక్కువగా నమోదవడంతో వచ్చే ఫెడ్ మీటింగ్‌లో వడ్డీ రేట్ల పెంపు నిర్ణయం ఉండకపోవచ్చన్న అభిప్రాయం అనలిస్టుల్లో వ్యక్తమవుతోంది.

దీంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ మెరుగుపడింది. గురువారం ఉదయం ప్రధాన ఆసియా మార్కెట్లు ఎక్కువగా లాభాలతో ఉన్నాయి. అయితే క్రూడ్ ఆయిల్(Crude oil) ధరలు ఎగువ స్థాయిలోనే ఉండడం ఆందోళన కలిగిస్తోంది.

Oct 10 Market Analysis | యూఎస్ మార్కెట్లు..

గత సెషన్‌లో నాస్‌డాక్ 0.24 శాతం పెరగ్గా.. ఎస్ అండ్ పీ 0.25 శాతం నష్టంతో ముగిసింది. గురువారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.13 శాతం లాభంతో ఉంది.

Oct 10 Market Analysis | యూరోప్ మార్కెట్లు..

జర్మనీకి చెందిన డీఏఎక్స్ 0.79శాతం, ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 0.90 శాతం, యూకేకు చెందిన ఎఫ్టీఎస్ ఈ 0.29 శాతం నష్టంతో ముగిశాయి.

IND vs WI ODI | హిస్టారికల్ ఛేజింగ్.. విండీస్‌పై భారత్ ఘన విజయం!..రికార్డుల తుపాను సృష్టించిన శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ

Oct 10 Market Analysis | ఆసియా మార్కెట్లు..

ప్రధాన ఆసియా మార్కెట్లు లాభాలతో ఉన్నాయి. ఉదయం 7.50 గంటల ప్రాంతంలో జపాన్‌కు చెందిన నిక్కీ 2.32 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 0.36 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.31 శాతం, సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 0.27 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.11 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 0.04 శాతం లాభంతో కదలాడుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 0.34 శాతం నష్టంతో ఉండడంతో మన మార్కెట్లు గ్యాప్ డౌన్‌లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

గమనించాల్సిన అంశాలు..

  • విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు వరుసగా ఐదో సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. నికరంగా రూ. 10,148 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
  • డీఐఐలు వరుసగా 36 వ సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. గత సెషన్‌లో నికరంగా రూ. 11,271 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు.
  • డాలర్‌తో రూపాయి మారకం విలువ 17 పైసలు బలపడి 95.82 వద్ద ఉంది.
  • క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 97.86 డాలర్ల వద్ద ఉంది.
  • యూఎస్ డాలర్ ఇండెక్స్ 101.58 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 5.31 శాతం వద్ద ఉంది.
  • నిఫ్టీ పుట్‌కాల్ రేషియో 0.91 నుంచి 0.79 కు తగ్గింది.
  • విక్స్ 0.58 శాతం పెరిగి 13.49 వద్ద ఉంది.
  • సెన్సెక్స్ డెరివేటివ్స్ వీక్లీ, మంత్లీ ఎక్స్‌పైరీ నేపథ్యంలో మార్కెట్‌లో ఒడుదుడుకులు ఉండే అవకాశాలున్నాయి.
Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *