KTS SSC Results | పది ఫలితాల్లో సత్తా చాటిన కేటీఎస్​ విద్యార్థులు

shashi kiran Mottala

 అక్షరటుడే, గాంధారి: KTS SSC Results | పదో తరగతి ఫలితాల్లో మండలంలోని కేటీఎస్​ విద్యార్థులు (KTS Students) సత్తా చాటారు. మండలంలోని ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలను కైవసం చేసుకున్నారు. ఈ మేరకు స్కూల్​ ప్రిన్సిపల్ పరశురాం వివరాలు వెల్లడించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. తమ పాఠశాల విద్యార్థులు కె రఘుచంద్ర 567 మార్కులతో మండల టాపర్​గా నిలువగా.. మండల సెకండ్​ టాపర్​గా డి రష్మిత 566, తృతీయ స్థానంలో డి ఐశ్వర్య 555 మార్కులతో విజయకేతనం ఎగురవేశారన్నారు.

KTS SSC Results | పాఠశాలలో 99శాతం ఉత్తీర్ణత..

పాఠశాలలో ఈ ఏడాది 99శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ప్రిన్సిపాల్​ తెలిపారు. విద్యార్థులు చాలా కష్టపడి ఉత్తమ ఫలితాలు సాధించారని.. పాఠశాలకు పేరు తెచ్చారన్నారు. దీనికి సహకరించిన కేటీఎస్​ పాఠశాల డైరెక్టర్లు హరి సూరత్నం, విజయ్, ఉపాధ్యాయ బృందానికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

ఇది కూడా చదవండి..: Traffic Constable Help | రక్తదానం చేసి చిన్నారి ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్​ కానిస్టేబుల్​

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *