అక్షరటుడే వెబ్డెస్క్: Vijay Conductor | తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రజల్లోకి వెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచారు. తాజాగా ఆయన ఓ ప్రభుత్వ బస్సులో సడన్గా కండక్టర్గా ప్రయాణికులకు స్వయంగా టికెట్లు జారీ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
Vijay Conductor | ఉచిత బస్సు ప్రయాణం విస్తరణ..
తమిళనాడులో అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 84 లక్షల మంది మహిళలు ప్రయోజనం పొందుతున్నారు. అయితే, ఈ సేవల పరిధిని ప్రభుత్వం తాజాగా మరింత విస్తరించింది. ఇంతవరకు కేవలం సాధారణ (ఆర్డినరీ) బస్సులకే పరిమితమైన ఈ ఉచిత ప్రయాణ సదుపాయాన్ని.. ఇకపై డీలక్స్, ఎక్స్ప్రెస్ కేటగిరీ బస్సులకు కూడా వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకపు విస్తరణను అధికారికంగా చాటిచెప్పేందుకు సీఎం విజయ్ స్వయంగా బస్సు ఎక్కారు.
Vijay Conductor | ప్రయాణికులతో ముచ్చట..
బస్సులో ప్రయాణిస్తున్న మహిళలతో కాసేపు ముచ్చటించిన విజయ్.. వారి యమక్షేమాలను, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బస్సులో ఉన్న కొందరు కాలేజీ విద్యార్థినులు ఎంతో ప్రేమతో ఆయనకు చాక్లెట్లు ఇవ్వగా, వాటిని విజయ్ ఎంతో ఆప్యాయంగా తీసుకుని తన జేబులో దాచుకున్నారు. మహిళల ఆర్థిక భారాన్ని తగ్గించడంతో పాటు ప్రజా రవాణాను మరింతగా ప్రజలకు చేరువ చేయడమే ఈ ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రధాన ఉద్దేశమని విజయ్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ పథకం విస్తరణతో మరింత ఎక్కువ మంది మహిళలకు లబ్ధి చేకూరుతుందని ఆయన తెలిపారు.
ఆర్టీసీ బస్సులో మహిళలకు సీఎం విజయ్ స్వయంగా ఉచిత టికెట్లు అందించారు…
ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులు డైరీ మిల్క్ చాక్లెట్లు పంచుకుంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. బస్సులో పండుగ వాతావరణం నెలకొంది..#TVKvijay #Tamilnadu pic.twitter.com/Tg2KS6MX5H
— Telugu Stride (@TeluguStride) October 2, 2026
ఇది కూడా చదవండి: Farmers Power Protest | విద్యుత్ సబ్ స్టేషన్ను ముట్టడించిన రైతులు