Red Cross Nizamabad | రెడ్​క్రాస్​ ద్వారా సేవచేసే అవకాశమివ్వండి..

రెడ్​క్రాస్​ సొసైటీ ద్వారా ప్రజలకు సేవచేసే అవకాశం ఇవ్వాలని రెడ్​క్రాస్​ ప్రస్తుత ఛైర్మన్​ బుస్సా ఆంజనేయులు కోరారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Red Cross Nizamabad | రెడ్​క్రాస్​ సొసైటీ ద్వారా ప్రజలకు సేవచేసే అవకాశం ఇవ్వాలని రెడ్​క్రాస్​ ప్రస్తుత ఛైర్మన్​ బుస్సా ఆంజనేయులు కోరారు. నగరం (Nizamabad)లోని మీడియా సమావేశం నిర్వహించారు.

Red Cross Nizamabad | 14మందితో కూడిన ప్యానెల్​..

ఆయన మాట్లాడుతూ.. బుస్సా ఆంజనేయులు ప్యానెల్ పేరుతో మొత్తం 14 మంది ప్రస్తుతం పోటీలో ఉన్నామన్నారు. ఈ 14మంది కూడా 15ఏళ్లుగా రెడ్​క్రాస్​కు సేవ చేస్తున్నామన్నారు. అర్ధరాత్రి అపరాత్రి అని చూడకుండా రక్తం అవసరం ఉన్నప్పుడు అత్యవసర పరిస్థితుల్లో స్పందించి రక్తం ఏర్పాటు చేశామన్నారు. రెడ్ క్రాస్ అంటే కేవలం రక్తదాన సేవలకే పరిమితం కాకుండా తలసేమియా వార్డు, వృద్ధాశ్రమం, డే కేర్ సెంటర్​ ఇలా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. తమ ప్యానెల్​కు మరోసారి అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు.

మొత్తం 14 మంది గెలిస్తేనే తమ ప్యానెల్ అభ్యర్థి ఛైర్మన్ అవుతాడని, రెడ్​క్రాస్​ ద్వారా మరిన్ని సేవలు చేసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. తమ ప్యానెల్​లో ఏ.రవీందర్, బి.ఆంజనేయులు, బచ్చబోయిడి గంగ కిషన్, బైరి విజయసాగర్, డి.వెంకటేశం, డొల్ల రాజేశ్వర్ రెడ్డి, గున్నల వెంకటేష్ గౌడ్, కరిపే రవీందర్, కులకర్ణి రమేష్ బాబు, ఎం.శ్రీనివాస్, ఎన్.కృష్ణ, నీరడి వెంకటేశ్వర్లు, సైదు రమేష్, సుధాకర్ నరాల ఉన్నారని వివరించారు. ఈ సభ్యులను గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో నరాల సుధాకర్, కరిపె రవీందర్, రమేష్ బాబు, నీరడి వెంకటేశ్వర్లు, బొబ్బిలి కిరణ్, సందేశ్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Gandhi Jayanti Banswada | గాంధీజీ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: ఎమ్మెల్యే పోచారం

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *