అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Physicians Association | కామారెడ్డి (Kamareddy) ఫిజీషియన్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం ఆదివారం నిర్వహించారు. స్థానిక ఐఎంఏ భవనంలో ఈ కార్యక్రమం జరిగింది.
Kamareddy Physicians Association | ప్రత్యేక హెల్త్ క్యాంపులు
అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్ ఆఫ్ ఇండియా (Physicians Association of Telangana) తెలంగాణ చాప్టర్లోని కామారెడ్డి బ్రాంచ్ ఆధ్వర్యంలో కార్యవర్గం కొలువుదీరింది. ఫిజీషియన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా వెంకట్, జనరల్ సెక్రెటరీగా నవీన్ కుమార్, కోశాధికారిగా జమాల్, ఉపాధ్యక్షుడిగా శ్రీనివాస్ రావు, జాయింట్ సెక్రెటరీగా జయచంద్ర ప్రమాణ స్వీకారం చేశారు. జాతీయ అధ్యక్షుడు నర్సింలు, రాష్ట్ర అధ్యక్షుడు డా.నవాల్ చంద్ర, సెక్రెటరీ త్రిలోక్ చందర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతినెల ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని ప్రత్యేక హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయాలని సూచించారు. షుగర్, బీపీ, కిడ్నీ, ఇతర వ్యాధులకు సంబంధించిన స్క్రీనింగ్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున్, సెక్రెటరీ డా.శ్రీధర్, ఐఎంఏ సభ్యులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: కేబీఆర్ పార్కు ప్రాజెక్టుకు బ్రేక్.. రూ.1,090 కోట్ల పనులు రద్దు!