Kamareddy Physicians Association | అట్టహాసంగా కామారెడ్డి ఫిజీషియన్స్ అసోసియేషన్ ప్రమాణ స్వీకారం

కామారెడ్డి ఫిజీషియన్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం ఆదివారం నిర్వహించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Physicians Association | కామారెడ్డి (Kamareddy) ఫిజీషియన్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం ఆదివారం నిర్వహించారు. స్థానిక ఐఎంఏ భవనంలో ఈ కార్యక్రమం జరిగింది.

Kamareddy Physicians Association | ప్రత్యేక హెల్త్​ క్యాంపులు

అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్ ఆఫ్ ఇండియా (Physicians Association of Telangana) తెలంగాణ చాప్టర్​లోని కామారెడ్డి బ్రాంచ్ ఆధ్వర్యంలో కార్యవర్గం కొలువుదీరింది. ఫిజీషియన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా వెంకట్, జనరల్ సెక్రెటరీగా నవీన్ కుమార్, కోశాధికారిగా జమాల్, ఉపాధ్యక్షుడిగా శ్రీనివాస్ రావు, జాయింట్ సెక్రెటరీగా జయచంద్ర ప్రమాణ స్వీకారం చేశారు. జాతీయ అధ్యక్షుడు నర్సింలు, రాష్ట్ర అధ్యక్షుడు డా.నవాల్ చంద్ర, సెక్రెటరీ త్రిలోక్ చందర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతినెల ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని ప్రత్యేక హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయాలని సూచించారు. షుగర్, బీపీ, కిడ్నీ, ఇతర వ్యాధులకు సంబంధించిన స్క్రీనింగ్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున్, సెక్రెటరీ డా.శ్రీధర్, ఐఎంఏ సభ్యులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: కేబీఆర్‌ పార్కు ప్రాజెక్టుకు బ్రేక్‌.. రూ.1,090 కోట్ల పనులు రద్దు! 

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *