నిజామాబాద్Scientific Farming Methods | సాగులో శాస్త్రీయ పద్ధతులు పాటించాలి

Scientific Farming Methods | సాగులో శాస్త్రీయ పద్ధతులు పాటించాలి

వ్యవసాయంలో శాస్త్రీయ పద్ధతులు పాటించడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చని వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ జి. రాకేష్ పేర్కొన్నారు.

అక్షరటుడే, భీమ్​గల్ (ముచ్కూర్): Scientific Farming Methods | వ్యవసాయంలో శాస్త్రీయ పద్ధతులు(Scientific Farming) పాటించడం ద్వారానే లాభదాయకమైన దిగుబడులు సాధ్యమని వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ జి. రాకేష్ పేర్కొన్నారు. ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ‘రైతు ముంగిట్లోకి శాస్త్రవేత్తలు’ అనే కార్యక్రమాన్ని భీమ్​గల్(Bheemgal mandal)​ మండలం ముచ్కూర్ గ్రామంలోని రైతు వేదికలో గురువారం నిర్వహించారు.

Scientific Farming Methods | యూరియా వాడకాన్ని తగ్గించాలి..

శాస్త్రవేత్తలు మాట్లాడుతూ రైతులు ఎదుర్కొంటున్న సాగు సమస్యలపై అవగాహన కల్పించారు. ప్రధానంగా పంటల్లో యూరియా వాడకాన్ని తగ్గించాలని సూచించారు. అనవసరంగా యూరియాను ఎక్కువగా వాడటం వల్ల సాగు ఖర్చు పెరుగుతుందే తప్ప ఆశించిన ఫలితం ఉండదన్నారు. మోతాదుకు మించి యూరియా వాడటంతో నేలలోని సహజ పోషకాలు దెబ్బతింటాయని.. ఇది దీర్ఘకాలంలో భూసారాన్ని తగ్గించి పంట దిగుబడిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు.

Scientific Farming Methods | సమతుల్య ఎరువులు..

రైతులు కేవలం యూరియాపైనే ఆధారపడకుండా సమతుల్య ఎరువులను వినియోగించి సాగు ఖర్చు తగ్గించుకోవడంతో పాటు నేల ఆరోగ్యాన్ని(Soil Health) కాపాడుకోవాలని సూచించారు. ఏప్రిల్ 30 నుంచి మే 23 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రుద్రూర్ (Rudrur) పరిశోధనా కేంద్రం టీచింగ్ అసోసియేట్ సిరాజ్, మండల వ్యవసాయ అధికారి (MAO) బి లావణ్య, వ్యవసాయ విస్తరణాధికారి (AEO) జి అరవింద్, ముచ్కూర్ సర్పంచ్ కె శ్రీనివాస్ పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Telangana Advisors | ‘సలహాదారుల’తో ఖజానాకు భారం.. అప్పుల రాష్ట్రంలో అదనపు ఖర్చు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Gold Loans | గోల్డ్ లోన్లకు భారీ డిమాండ్.. రెండేళ్లలో ఐదు రెట్లు పెరుగుదల

అక్షరటుడే, వెబ్​డెస్క్: Gold Loans | దేశంలో బంగారం తనఖా పెట్టి...

Amazon Summer Sale | సమ్మర్ సేల్ కు అమెజాన్ రెడీ.. మే 8 నుంచే గ్రేట్ సమ్మర్ సేల్

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Amazon Summer Sale | అమెజాన్ (Amazon)...

Flipkart Sale | ఫ్లిప్‌కార్టులో ఆఫర్ల జాతర.. 9 నుంచి సాసా లేలే సేల్

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Flipkart Sale | షాపింగ్ ప్రియులకు ఫ్లిప్‌కార్ట్...