అక్షరటుడే, వెబ్డెస్క్: Russia Drone Attack | నల్ల సముద్రంలో నౌకపై రష్యా డ్రోన్ దాడి చేసింది. ఈ ఘటనలో ఇద్దరు సిబ్బంది మరణించగా, ఒక భారతీయుడితో సహా మరికొందరు గాయపడ్డారు.
నల్ల సముద్రంలో ఎంవి రోయాద్ మమ్మడోవ్ అనే వాణిజ్య నౌకపై మంగళవారం తెల్లవారుజామున దాడి జరిగింది. రొమేనియా సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. క్షతగాత్రులు రొమేనియాలో చికిత్స పొందుతున్నారు. సిబ్బందిలో ముగ్గురు భారత జాతీయులు ఉండగా.. ఒకరికి గాయాలు అయ్యాయి. కార్గో నౌకలోని భారతీయులతో భారత రాయబారి మనోజ్ మహాపాత్ర మాట్లాడారు.
Russia Drone Attack | భారత్ స్పందన
రష్యా (Russia) దాడిపై భారత్ స్పందించింది. ఈ దాడి పూర్తిగా ఆమోదయోగ్యం కాదు అని పేర్కొంది. విదేశాంగ మంత్రి జైశంకర్ మాట్లాడుతూ ఉక్రెయిన్ వివాదాన్ని పరిష్కరించేందుకు భారత్ వాదించడానికే పరిమితం కాకుండా, కీవ్, మాస్కోలతో సంప్రదింపులు జరుపుతూ ఇటీవలి నెలల్లో తన ప్రయత్నాలను ముమ్మరం చేసిందని అన్నారు. రష్యా-ఉక్రెయిన్ వివాదాన్ని పరిష్కరించడానికి చర్చలు, దౌత్యమే మార్గమని ఆయన అన్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ఓడరేవు మౌలిక సదుపాయాలపై దాడులు పెరుగుతుండటంతో ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన నల్ల సముద్రం తీవ్ర అంతరాయాన్ని ఎదుర్కొంటోంది.
ఇదికూడాచదవండి: India Bypolls 2026 | దేశవ్యాప్తంగా 6 స్థానాలకు ఉపఎన్నికలు.. తమిళనాడు, బెంగాల్‌లో తీవ్ర ఉత్కంఠ