అక్షరటుడే, వెబ్‌డెస్క్: Chinese Crackers Seized | చెన్నై (Chennai) పోర్టులో భారీగా చైనా బాణాసంచాను డీఆర్ఐ అధికారులు సీజ్ చేశారు. వీటిని అక్రమంగా చైనా నుంచి దిగుమతి చేసుకున్నట్లు గుర్తించారు.
దీపావళీ వేడుకలకు ముందు పెద్ద ఎత్తున క్రాకర్స్‌ను చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు అధికారులకు సమాచారం అందింది. దీంతో చెన్నై పోర్టులో నిఘా పెంచారు. ఈ క్రమంలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా తీసుకొచ్చిన టపాసులను సీజ్ చేశారు. స్టేషనరీ, మెడికల్ గ్లౌజులు, ప్లాస్టిక్ వస్తువులు, గృహోపకరణాలు వంటి సరుకుల పేరుతో వీటిని దిగుమతి చేసుకున్నారు. కంటైనర్లలో ముందు ఆ సామగ్రి పెట్టి వెనుకాల దాచి ఉంచిన బాణసంచాను అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన బాణాసంచా విలువ రూ.12 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు.
Chinese Crackers Seized | టపాసుల దిగుమతిపై ఆంక్షలు
విదేశీ వాణిజ్య విధానం ప్రకారం క్రాకర్స్ దిగుమతిపై ఆంక్షలు ఉన్నాయి. వీటికి, పేలుడు పదార్థాల నియమాలు-2008 ప్రకారం అనుమతులు అవసరం. అయితే లైసెన్సులు లేకుండా.. ఇతర వస్తువుల పేరుతో చైనా నుంచి కొందరు టపాసులు దిగుమతి చేసుకుంటున్నారు. దీంతో అధికారులు తనిఖీలు చేపట్టి సీజ్ చేశారు.
ఇది కూడా చదవండి: Lucknow Airport Fire | లక్నో ఎయిర్‌పోర్టు వద్ద భారీ అగ్నిప్రమాదం