Rahul Gandhi Arrest | బారికేడ్లు ఎక్కిన రాహుల్‌గాంధీ.. అరెస్టు చేసిన పోలీసులు

ఎన్నికల కమిషనర్​ జ్ఞానేశ్​ కుమార్​ రాజీనామా చేయాలని డిమాండ్​ చేస్తూ ఆందోళన చేస్తున్న రాహుల్​ గాంధీని పోలీసులు అరెస్ట్ చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rahul Gandhi Arrest | ఢిల్లీలో ఉద్రిక్తత నెలకొంది. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్​ జ్ఞానేశ్​ కుమార్​ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ.. ధర్నా ఆందోళన చేస్తున్న రాహుల్​ గాంధీని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఎన్నికల కమిషనర్​ రాజీనామా చేయాలని ఇండియా కూటమి ఎంపీలు మంగళవారం ఉదయం పార్లమెంట్​ నుంచి ఎన్నికల సంఘం (Election Commission) కార్యాలయం వరకు ర్యాలీగా బయలుదేరారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్​ అగ్రనేతలు రాహుల్​ గాంధీ, ప్రియాంక గాంధీ, ఎంపీలు రోడ్డుపై ధర్నాకు దిగారు. పోలీసులు బారికేడ్లు అడ్డుపెట్టగా రాహుల్​ గాంధీ వాటిపైకి ఎక్కి నిరసన తెలిపారు. దీంతో పోలీసులు ఆయనతో పలువురు ఎంపీలు, నాయకులను అరెస్ట్ చేశారు. బస్సులలో అక్కడి నుంచి తరలించారు.

Rahul Gandhi Arrest | బస్సులో నుంచి దూకి..

రాహుల్ గాంధీ అకస్మాత్తుగా వాటిలో బారికేడ్​పైకి ఎక్కి జాతీయ జెండాను ఊపారు. ఆయనకు మద్దతుగా ఇండియా కూటమి ఎంపీలు నినాదాలు చేశారు. సీఈసీ రాజీనామా చేయాలని డిమాండ్​ చేశారు. అనంతరం రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని పోలీసులు బస్సులో తీసుకెళ్లారు. అయితే ఆ ఇద్దరు బస్సు నుంచి దూకి ఎన్నికల సంఘం భవనం వైపు వెళ్లారు. అనంతర వారిని మళ్లీ అదుపులోకి తీసుకొని ఆకాశవాణి భవన్‌కు తరలించారు. అక్కడ వారు తమ నిరసనను కొనసాగిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Allahabad High Court | మేజర్లకు పూర్తి వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుంది.. అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *