అక్షరటుడే, వెబ్డెస్క్ : Rahul Gandhi Arrest | ఢిల్లీలో ఉద్రిక్తత నెలకొంది. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ.. ధర్నా ఆందోళన చేస్తున్న రాహుల్ గాంధీని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలని ఇండియా కూటమి ఎంపీలు మంగళవారం ఉదయం పార్లమెంట్ నుంచి ఎన్నికల సంఘం (Election Commission) కార్యాలయం వరకు ర్యాలీగా బయలుదేరారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఎంపీలు రోడ్డుపై ధర్నాకు దిగారు. పోలీసులు బారికేడ్లు అడ్డుపెట్టగా రాహుల్ గాంధీ వాటిపైకి ఎక్కి నిరసన తెలిపారు. దీంతో పోలీసులు ఆయనతో పలువురు ఎంపీలు, నాయకులను అరెస్ట్ చేశారు. బస్సులలో అక్కడి నుంచి తరలించారు.
Rahul Gandhi Arrest | బస్సులో నుంచి దూకి..
రాహుల్ గాంధీ అకస్మాత్తుగా వాటిలో బారికేడ్పైకి ఎక్కి జాతీయ జెండాను ఊపారు. ఆయనకు మద్దతుగా ఇండియా కూటమి ఎంపీలు నినాదాలు చేశారు. సీఈసీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని పోలీసులు బస్సులో తీసుకెళ్లారు. అయితే ఆ ఇద్దరు బస్సు నుంచి దూకి ఎన్నికల సంఘం భవనం వైపు వెళ్లారు. అనంతర వారిని మళ్లీ అదుపులోకి తీసుకొని ఆకాశవాణి భవన్కు తరలించారు. అక్కడ వారు తమ నిరసనను కొనసాగిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Allahabad High Court | మేజర్లకు పూర్తి వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుంది.. అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు