Kamareddy Heat Wave | ‘రెడ్ జోన్’లో కామారెడ్డి జిల్లా.. అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు

Shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Heat Wave | కామారెడ్డి (kamareddy) జిల్లాలో ఎండలు సెగలు పుట్టిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు 45-46 డిగ్రీలకు చేరడంతో జిల్లాను ‘రెడ్ జోన్’గా (Red Zone Alert) ప్రకటించినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి(dmho) రవీందర్ గౌడ్ తెలిపారు.

Kamareddy Heat Wave | జాగ్రత్తలు పాటించాలి

డీఎంహెచ్‌వో మాట్లాడుతూ, ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉదయం 11 గంటలలోపే అన్ని పనులు పూర్తి చేసుకోవాలని, అత్యవసరమైతే తప్ప ఎండలో(summer heat) బయటకు రావొద్దని హెచ్చరించారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లల పట్ల ప్రత్యేక జాగ్రత్తలు వహించాలని కోరారు. వడదెబ్బ తగలకుండా తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తరచూ నీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు వంటివి తాగుతూ డీహైడ్రేషన్(Dehydration) బారిన పడకుండా చూసుకోవాలని సూచించారు. తలతిరగడం, వాంతులు, నీరసం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాలని తెలిపారు. జిల్లావ్యాప్తంగా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు (ORS Packets), అవసరమైన మందులు అందుబాటులో ఉంచామని, వడదెబ్బ కేసులపై ప్రత్యేక దృష్టి సారించామని డీఎంహెచ్‌వో వెల్లడించారు.

ఇది కూడా చదవండి: Amaravati Projects | ఏపీ క్యాబినెట్ భారీ నిర్ణయం.. రూ.1208 కోట్లతో క్వాంటం వ్యాలీ ట్విన్ టవర్ల నిర్మాణం!

2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *