అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Ashutosh Dixit | ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) కొత్త అధిపతిగా అశుతోష్ దీక్షిత్ నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం వైస్ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్‌గా ఉన్న ఎయిర్ మార్షల్ దీక్షిత్ వైమానిక దళానికి 29వ అధిపతి కానున్నారు.
అశుతోష్ దీక్షిత్‌కు మిరాజ్-2000, మిగ్ వేరియంట్లు, హెచ్‌పిటి-32, ఏఎన్-32, అవ్రో, కిరణ్, జాగ్వార్, ఐఎల్-78, హాక్, తేజస్ వంటి వివిధ విమానాలను నడపడంలో విస్తృతమైన అనుభవం ఉంది. సుమారు నాలుగు దశాబ్దాలుగా ఆయన వైమానిక దళంలో కొనసాగుతున్నారు. తన కెరీర్లో ఆపరేషన్ సఫేద్ సాగర్, ఆపరేషన్ రక్షక్, కోప్-ఇండియా, ఆపరేషన్ సిందూర్ లాంటి కీలక ఆపరేషన్లలో పాల్గొన్నారు. ప్రస్తుత ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ అక్టోబర్ 31న పదవి విరమణ చేస్తారు. ఆయన స్థానంలో దీక్షిత్ బాధ్యతలు స్వీకరిస్తారు.
Ashutosh Dixit | 20 ఏళ్లకే వైమానిక దళంలోకి..
అశుతోష్ దీక్షిత్ 1966 డిసెంబర్ 9న జన్మించారు. 20 ఏళ్ల వయసులోనే 1986 డిసెంబర్ 6న భారత వైమానిక దళంలోని ఫైటర్ స్ట్రీమ్‌లోకి నియమితులయ్యారు. అనంతరం అనేక హోదాల్లో పని చేశారు. గతంలో ఆయన ఎయిర్ మార్షల్ దీక్షిత్ హెడ్ క్వార్టర్స్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్‌లో చైర్మన్, చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీకి చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్‌గా పనిచేశారు. అనేక పురస్కారాలు అందుకున్నారు. 2026లో సైనిక అత్యున్నత పురస్కారం పరమ విశిష్ట సేవా పతకం అందుకోనున్నారు.
దీనిని కూడా చదవండి : Punjab CM OSD | పోస్టింగ్‌ల కోసం వసూళ్లు.. పంజాబ్ సీఎం ఓఎస్డీపై సీబీఐ కేసు