Sreeleela HMD Brand Ambassador | యంగ్ సెన్సేషన్ శ్రీలీలకు మరో క్రేజీ ఆఫర్.. హెచ్‌ఎండీ ‘వైబ్ ఫేస్’గా ఎంట్రీ

ప్రముఖ మొబైల్ బ్రాండ్ హెచ్‌ఎండీ (HMD) తన స్మార్ట్‌ఫోన్ల ప్రచారకర్తగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీలను నియమించుకుంది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Sreeleela HMD Brand Ambassador | ప్రముఖ మొబైల్ బ్రాండ్ హెచ్‌ఎండీ (HMD) తన స్మార్ట్‌ఫోన్ల ప్రచారకర్తగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీలను  ( Sreeleela )నియమించుకుంది. హెచ్‌ఎండీ స్మార్ట్‌ఫోన్లకు ‘వైబ్ ఫేస్’ (Vibe Face) గా శ్రీలీల వ్యవహరించనున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. టెక్నాలజీతో కూడిన తమ బ్రాండ్ వాల్యూను, యువతలో శ్రీలీలకు ఉన్న విపరీతమైన క్రేజ్‌ను జోడించి మార్కెట్లోకి దూసుకెళ్లేందుకు హెచ్‌ఎండీ ఈ ఒప్పందం కుదుర్చుకుంది.

Sreeleela HMD Brand Ambassador | భారీ క్యాంపెయిన్..

రాబోయే పండుగ సీజన్ (Festive Season) క్యాంపెయిన్‌లతో పాటు వివిధ వినియోగదారుల కార్యక్రమాల్లో శ్రీలీల ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. ఔట్‌డోర్, ప్రింట్, డిజిటల్, సోషల్ మీడియా , ఇన్‌ఫ్లుయెన్సర్ నెట్‌వర్క్‌ల ద్వారా ఈ ప్రచారం భారీ స్థాయిలో సాగనుంది.

Sreeleela HMD Brand Ambassador | యువతను ఆకర్షించేలా..

దేశవ్యాప్తంగా ఉన్న యువతతో శ్రీలీలకు ఉన్న బలమైన కనెక్షన్, ఆమె స్టైల్, గ్రేస్ హెచ్‌ఎండీ బ్రాండ్‌కు మరింత పాపులారిటీ తెచ్చిపెడతాయని కంపెనీ భావిస్తోంది. సామాన్యులకు కూడా అందుబాటు ధరల్లో మెరుగైన టెక్నాలజీని అందించడమే తమ లక్ష్యమని హెచ్‌ఎండీ పేర్కొంది.

Sreeleela HMD Brand Ambassador | సరికొత్త టెక్నాలజీ..

ఈ భాగస్వామ్యంపై హెచ్‌ఎండీ ఇండియా, ఏపీఏసీ వైస్ ప్రెసిడెంట్ అండ్ సీఈఓ రవి కున్వర్ మాట్లాడుతూ.. “యువతతో త్వరగా కనెక్ట్ అయ్యే శ్రీలీలతో మా ప్రయాణం ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉంది. పండుగ సమయానికి సరికొత్త టెక్నాలజీని వినియోగదారులకు మరింత ఆకర్షణీయంగా తీసుకువెళ్లేందుకు ఇది సరైన సమయం” అని తెలిపారు.

ఈ అసోసియేషన్ పట్ల శ్రీలీల స్పందిస్తూ.. “టెక్నాలజీని అందరికీ చేరువ చేయడంలో హెచ్‌ఎండీ చేస్తున్న ప్రయత్నం చాలా బాగుంది. డిఫరెంట్‌గా ఆలోచించే ఈ బ్రాండ్‌కు ‘వైబ్ ఫేస్’గా మారడం నాకు చాలా ఎక్సైటింగ్‌గా ఉంది” అని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి:  Wife Suicide Case | భార్య ఆత్మహత్య కేసులో భర్తకు ఐదేళ్ల జైలుశిక్ష

 

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *