అక్షరటుడే వెబ్‌డెస్క్: Gel-Based Cockroach Repellent | పండుగలు వస్తున్నాయంటే ప్రతి ఇంట్లో శుభ్రం చేసే హడావుడి మొదలవుతుంది. వంటగదిలోని ( Kitchen )సామానును తుడవడం, అల్మారాలు సర్దడం, ఇల్లంతా నీట్‌గా ఉంచడం మన సాంప్రదాయం. అయితే ఎంత పరిశుభ్రంగా ఉంచినా చాలా ఇళ్లలో సతమతం చేసే ప్రధాన సమస్య దాగి ఉన్న బొద్దింకల బెడద. దీనిపై ముంబై బాంబే హాస్పిటల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కన్సల్టెంట్ పీడియాట్రీషియన్ డాక్టర్ ముకేష్ సంకలేచా కీలక సూచనలు చేశారు. ఇల్లు పైకి శుభ్రంగా కనిపించడమే కాకుండా, లోపలి నుంచి ఆరోగ్యకరంగా ఉండేందుకు పండుగ చెక్‌లిస్ట్‌లో జెల్ ఆధారిత బొద్దింకల నివారణ (Gel-based cockroach repellent) ఎందుకు ఉండాలో వివరించారు.
Gel-Based Cockroach Repellent | దాగి ఉన్నవి ఎన్నో..
మనకు కంటికి కనిపించే బొద్దింకలు సమస్యలో చాలా చిన్న భాగం మాత్రమే. ఇవి ఎక్కువగా అల్మారాల సందుల్లో, గృహోపకరణాల వెనుక, సింక్‌ల కింద, డ్రైనేజీ పైపుల సందులలో దాక్కుంటాయి. కంటికి కనిపించగానే స్ప్రేలు కొట్టడం వల్ల తాత్కాలిక ఉపశమనం లభిస్తుందే తప్ప, వాటి రహస్య స్థావరాలలో ఉన్న అసలు సమస్య పరిష్కారం కాదు.
ఆరోగ్యానికి పెద్ద ముప్పు..
బొద్దింకలు మురికికాలువలు, చెత్త ప్రదేశాల నుంచి హానికర క్రిములను మోసుకొచ్చి మనం వండే ఆహార పదార్థాలు, పాత్రలపై వదులుతాయి. వీటి మలవిసర్జన, రాలిన చర్మ భాగాలు ముఖ్యంగా పిల్లల్లో , సున్నితమైన తత్వం ఉన్నవారిలో అలర్జీలు, ఆస్తమా వంటి సమస్యలను పెంచుతాయి.
Gel-Based Cockroach Repellent | పండుగ వంటకాలు..
పండుగ సమయంలో ఇళ్లలో పిండివంటలు, మిఠాయిలు, అదనపు సరుకులు ఎక్కువగా నిల్వ ఉంటాయి. కింద పడే తినుబండారాలు, తడి , చీకటి మూలలు బొద్దింకలను సులభంగా ఆకర్షిస్తాయి. కాబట్టి పైకి మెరిసే పరిశుభ్రతతో పాటు వాటిని ఆకర్షించే కారణాలను అరికట్టడం ముఖ్యం.
నివారణే సరైన పరిష్కారం..
హిట్ యాంటీ-రోచ్ (HIT Anti-Roach Gel) వంటి జెల్ ఆధారిత మందులు బొద్దింకలు తిరిగే రహస్య మార్గాల్లో అద్భుతంగా పనిచేస్తాయి. సింక్‌ల కింద, ఫ్రిజ్ వెనుక, ప్లంబింగ్ పైపుల దగ్గర చిన్న చిన్న చుక్కలుగా ఈ జెల్‌ను పెడతారు. బొద్దింకలు ఈ జెల్‌ను తిని తమ గూళ్లకు వెళ్లడం వల్ల లోపల ఉన్న ఇతర బొద్దింకలకు కూడా మందు ప్రభావం విస్తరించి, సమూహమంతా నశిస్తుంది.
Gel-Based Cockroach Repellent | నాశనం చేసే సాంకేతికత..
ఈ జెల్ విధానం వల్ల ఒక్కొక్క దాన్ని చంపే అవసరం లేకుండా, సమస్య మూలాల్లోకి వెళ్లి ఒకేసారి గుంపు మొత్తాన్ని తొలగించవచ్చు. పండుగ హడావుడిలో పదే పదే శ్రమపడకుండా ఇది ఎంతగానో ఉపకరిస్తుంది.
ఇళ్లకు సులువైన మార్గం..
పండుగ సమయంలో ఇంటికి బంధువులు, అతిథులు వస్తుంటారు. జెల్ మందు వల్ల ఎలాంటి మురికిగానీ, వాసనగానీ ఉండదు. ఎవరికీ కనిపించకుండా మూలల్లో పొడిగా ఉండే చోట చదరపు మీటరుకు 3 నుంచి 4 చుక్కలు (మొత్తంగా 20 చిన్న చుక్కలు) పెడితే సరిపోతుంది. ఇది సుమారు 30 నుంచి 45 రోజుల పాటు సమర్థవంతంగా పనిచేస్తుంది.
జాగ్రత్త పడటం ఉత్తమం..
పండుగ వేడుకలు, పిండివంటల హడావుడి తారాస్థాయికి చేరకముందే ఈ నివారణ చర్యలు తీసుకోవడం మంచిది. సర్దుబాట్లు చేసేటప్పుడే ఇవి దాక్కునే స్థలాలు బయటపడతాయి కాబట్టి, ముందే జెల్ రాసి ఉంచితే పండుగ సమయంలో ప్రశాంతంగా వేడుకలు జరుపుకోవచ్చు.
ఇది కూడా చదవండి: Contract Teacher Death | కాంట్రాక్టు ఉపాధ్యాయుడి ఆత్మహత్య