Axis Bank Economics Centre | ఆర్థిక రంగంలో సరికొత్త విప్లవం.. ఐఐఎంబిలో యాక్సిస్ బ్యాంక్ భారీ ప్రాజెక్ట్

భారతదేశంలోని ప్రముఖ ప్రైవేట్ రంగానికి చెందిన యాక్సిస్ బ్యాంక్ (Axis Bank) , ప్రతిష్టాత్మక ఐఐఎం బెంగళూరు (IIM Bangalore) మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం కుదిరింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Axis Bank Economics Centre | భారతదేశంలోని ప్రముఖ ప్రైవేట్ రంగానికి చెందిన యాక్సిస్ బ్యాంక్ (Axis Bank) , ప్రతిష్టాత్మక ఐఐఎం బెంగళూరు (IIM Bangalore) మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం కుదిరింది. బెంగళూరులోని  ( Bangalore )జిగణి వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ‘ఐఐఎంబి – దొరాబ్జీ టాటా స్కూల్ ఆఫ్ అండర్‌గ్రాడ్యుయేట్ స్టడీస్’ క్యాంపస్‌లో ‘యాక్సిస్ బ్యాంక్ సెంటర్ ఆఫ్ ఎకనామిక్స్’ (Axis Bank Centre of Economics) ను ప్రారంభించేందుకు ఇరు సంస్థలు అవగాహన ఒప్పందం (MoU)పై సంతకాలు చేశాయి.

Axis Bank Economics Centre| అవగాహన ఒప్పందం..

ముంబై వర్లీలోని యాక్సిస్ హౌస్‌లో ఈ ఒప్పంద కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐఐఎం బెంగళూరు బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఛైర్‌పర్సన్ డాక్టర్ దేవి ప్రసాద్ శెట్టి, యాక్సిస్ బ్యాంక్ ఎమ్‌డీ & సీఈఓ అమితాబ్ చౌదరి, ఐఐఎంబి ఇన్‌ఛార్జ్ డైరెక్టర్ ప్రొఫెసర్ యు. దినేష్ కుమార్, , యాక్సిస్ బ్యాంక్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) గ్రూప్ హెడ్ విజయ్ ముల్బాగల్తో పాటు ఇరు సంస్థల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Axis Bank Economics Centre | పరిశోధనలు, స్కాలర్‌షిప్‌లు..

ఈ భాగస్వామ్యంలో భాగంగా నూతన క్యాంపస్‌లోని ఇంటిగ్రేటెడ్ అకాడమిక్ బ్లాక్‌లో ఎకనామిక్స్ సెంటర్ నిర్మాణం, నిర్వహణకు యాక్సిస్ బ్యాంక్ ఆర్థిక, సాంకేతిక సహకారాన్ని అందిస్తుంది. వీటితో పాటు:

అధ్యాపకుల నైపుణ్యాభివృద్ధి (Faculty Development), ఆర్థిక రంగంలో పరిశోధనలను ప్రోత్సహించడం.

ప్రతిభావంతులైన, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు (Scholarships) అందించడం.

డేటా ఆధారిత విశ్లేషణ, అధునాతన గణాంక పద్ధతులతో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన పాఠ్యప్రణాళికను అమలు చేయడం.

Axis Bank Economics Centre | 40 మందికి ఆర్థిక శాస్త్రంలో శిక్షణ..

ఆగస్టు 2026లో ప్రారంభమైన ఈ ఐఐఎంబి అండర్‌గ్రాడ్యుయేట్ క్యాంపస్‌లో బిఎస్సీ (డేటా సైన్స్, ఎకనామిక్స్) కోర్సుల కోసం దాదాపు 12,000 మంది దరఖాస్తు చేసుకోగా, అత్యంత కఠినమైన ఎంపిక ప్రక్రియ ద్వారా 80 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. అందులో 40 మంది విద్యార్థులు ఈ ‘యాక్సిస్ బ్యాంక్ సెంటర్ ఆఫ్ ఎకనామిక్స్’ వేదికగా ‘డేటా సైన్స్’ మైైనర్‌గా ‘ఆర్థిక శాస్త్రంలో బిఎస్సీ డిగ్రీ’ విద్యను అభ్యసించనున్నారు.

సరికొత్త అడుగు..
ఈ సందర్భంగా యాక్సిస్ బ్యాంక్ ప్రతినిధి విజయ్ ముల్బాగల్ మాట్లాడుతూ.. దేశ ప్రగతికి, సంక్లిష్ట ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవడానికి బహుళ-విజ్ఞాన విద్య, పరిశోధనలు ఎంతగానో అవసరమని పేర్కొన్నారు. ఐఐఎంబి డైరెక్టర్ ప్రొఫెసర్ యు. దినేష్ కుమార్ మాట్లాడుతూ.. వ్యాపారాలు, మార్కెట్లు, సమాజాన్ని అర్థం చేసుకోవడానికి ఆర్థిక శాస్త్రం ఎంతో కీలకమైనదని, యాక్సిస్ బ్యాంక్ అందిస్తున్న ఈ మద్దతు ప్రపంచ స్థాయి విద్యార్థులను తీర్చిదిద్దడానికి దోహదపడుతుందని ధన్యవాదాలు తెలిపారు.

ఇది కూడా చదవండి: Contract Teacher Death | కాంట్రాక్టు ఉపాధ్యాయుడి ఆత్మహత్య

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *