అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Nizamabad Police Prajavani | పోలీస్ ప్రజావాణికి 39 ఫిర్యాదులు అందాయి. నగరంలోని సీపీ కార్యాలయంలో (Nizamabad Police) పోలీస్‌కమిషనర్ సాయిచైతన్య (CP Sai Chaitanya) స్వయంగా ఫిర్యాదులు స్వీకరించారు.
Nizamabad Police Prajavani | నిర్భయంగా ఫిర్యాదు చేయండి
ప్రజావాణిలో భాగంగా స్వయంగా ఫిర్యాదుదారులతో మాట్లాడిన సీపీ సాయిచైతన్య వారి సమస్యలు విన్నారు. అనంతరం సంబంధిత పోలీస్స్టేషన్ల ఎస్సైలు, సీఐలతో మాట్లాడి చట్టపరంగా సమస్యల పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలు నిర్భయంగా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఎలాంటి, పైరవీలు లేకుండా స్వచ్ఛందంగా పోలీసు సేవల్ని వినియోగించుకోవచ్చన్నారు. ప్రజా సమస్యలపై ఫిర్యాదులు నేరుగా స్వీకరిస్తూ ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వారా సమస్యలు పరిష్కరిస్తున్నామన్నారు.
ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. ఒకరి అరెస్ట్.. పరారీలో ఇద్దరు..